తెలుగు ఆడియెన్స్ కి పూజా హెగ్డే గుడ్‌ న్యూస్‌.. రీఎంట్రీ ప్రకటన, టాలీవుడ్‌లో గ్యాప్‌కి కారణం ఏంటంటే?

Pooja Hegde: తెలుగు ఆడియెన్స్ చేత బుట్టబొమ్మ అని ముద్దుగా పిలిపించుకున్న పూజా హెగ్డే టాలీవుడ్‌లో మూవీ చేసి మూడేళ్లు అవుతుంది. `రాధేశ్యామ్‌`, `ఆచార్య` తర్వాత ఆమె తెలుగులో సినిమాలు చేయలేదు. ఈ చిత్రాలు పరాజయం చెందడంతో ఆమె టాలీవుడ్‌ కి గుడ్‌ బై చెప్పేసిందనే వార్తలు వచ్చాయి. దీనికితోడు తెలుగులో మూడు సినిమాలు ఆగిపోయాయి. `గుంటూరు కారం` నుంచి తీసేశారు. అలాగే `భగవంత్‌ కేసరి` నుంచి కూడా తప్పించారు. మరోవైపు `గాంజా శంకర్‌` మూవీ ఆగిపోయింది. దీంతో తెలుగు లో ఒక్కసారిగా జీరో అయిపోయింది పూజా. 
 

pooja hegde Tollywood re entry confirm she open up why not do telugu movies in telugu arj
pooja hegde

Pooja Hegde: స్టార్‌ హీరోయిన్‌గా వెలిగిన పూజా హెగ్డే తెలుగులో సినిమాలు చేయకపోవడం పట్ల చర్చనీయాంశం అయ్యింది. ఓ మూవీ సెట్‌లో చేదు అనుభవం, ఓ హీరోతో చిన్నపాటి ఇష్యూస్‌ ఆమె తెలుగులో మూవీస్‌ చేయకపోవడానికి కారణమనే వార్తలు వినిపించాయి.

దీనికి తోడు పూజా తెలుగు తప్ప తమిళంలో, హిందీలో మూవీస్‌ చేస్తుండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో అసలు నిజాలు వెల్లడించింది పూజా. ఆమె చాలా గ్యాప్‌ తర్వాత తెలుగు మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చింది. 

pooja hegde Tollywood re entry confirm she open up why not do telugu movies in telugu arj
pooja hegde

ఈ క్రమంలో తెలుగు ఆడియెన్స్ కి, తన తెలుగు అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తెలుగులో చేయబోతున్న సినిమా విశేషాలను తెలిపింది. తాను టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తుందట. ఓ తెలుగు మూవీకి సైన్‌ చేసిందట.

అయితే ఆ సినిమాని మేకర్స్ ప్రకటిస్తారని, తాను ఏం చెప్పలేనని తెలిపింది. కానీ తెలుగులో ఒక సినిమాకి సైన్‌ చేసినట్టు ఆమె కన్ఫమ్‌ చేసింది. త్వరలో తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతున్నట్టు తెలిపింది. 
 


pooja hegde

ఈ సందర్భంగానే అసలు విషయం చెప్పింది. టాలీవుడ్‌లో మూవీస్‌ చేయకపోవడానికి కారణం చెబుతూ, గతంలో తాను వరుసగా సినిమాలు చేయడం వల్ల ఫలితాలు తేడా కొట్టాయి. దీంతో ఇకపై ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుందని, రెగ్యూలర్‌ రోల్స్, మూవీస్‌ చేయాలనుకోవడం లేదట. సమ్‌థింగ్‌ కొత్తగా ఉండే పాత్రలు రావడం లేదని, ఎగ్జైటింగ్‌గా అనిపించే స్క్రిప్ట్ రావడం లేదని, అందుకే ఒప్పుకోలేదని తెలిపింది.

ఏదైనా కొత్తగా, వాహ్‌ అనిపించే సినిమాలు చేయాలని ఉందని, అలాంటి రోల్స్ కోసం వెయిట్‌ చేస్తున్నట్టు తెలిపింది పూజా. అందుకే తెలుగులో గ్యాప్‌ వచ్చిందని, కావాలని గ్యాప్‌ తీసుకోలేదని తెలిపింది. ఐడిల్‌ బ్రెయిన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించింది పూజా. 
 

Pooja Hegde

`ఒక లైలా కోసం`, `ముకుందా` చిత్రాలతో 2014లో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది పూజా. `డీజే`, `సాక్ష్యం`, `అరవింద సమేత`, `గద్దల కొండ గణేష్‌`, `మహర్షి`, `అలా వైకుంఠపురములో`,

`మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌`, `ఆచార్య`, `రాధేశ్యామ్‌` చిత్రాల్లో నటించింది. ప్రారంభంలో ఆమె నటించిన సినిమాలన్నీ హిట్‌ కావడంతో గోల్డెన్‌ లెగ్‌ అన్నారు. చివర్లో ఆమె నటించిన సినిమాలన్నీ పరాజయం చెందడంతో ఐరన్‌ లెగ్‌ ట్యాగ్‌ ఇచ్చారు. 

Retro pooja hegde

ఇప్పుడు మళ్లీ పుంజుకుంటుంది పూజా. తమిళంలో రెండు పెద్ద సినిమాలు చేస్తుంది. సూర్యతో `రెట్రో` మూవీలో హీరోయిన్‌గా నటించింది. ఇది మే 1న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌ లో భాగంగానే లేటెస్ట్ గా ఇంటర్వ్యూ ఇచ్చింది.

దీంతోపాటు విజయ్‌తో `జన నాయగన్‌` చిత్రంలో నటిస్తుంది. `కాంచన 4`లోనూ చేస్తుందట. మరోవైపు `కూలీ`లో స్పెషల్‌ సాంగ్‌ చేసింది. అలాగే ఓ హిందీ మూవీలో నటిస్తూ బిజీగా ఉంది పూజా. ఇక బాక్‌ టూ బాక్‌ ఆడియెన్స్ ని అలరించబోతుంది. 

read  more: సిల్క్ స్మితని వాడుకొని వదిలేసిన స్టార్‌ డైరెక్టర్‌.. ఒంటరిని చేసి ఏకంగా సెట్‌లోనే వదిలేసి.. దారుణంగా అవమానం

also read: జైల్ ట్రీట్‌మెంట్‌.. ఫస్ట్ టైమ్‌ ఓపెనైన హీరో సుమన్‌.. జైల్లో ఉన్న వాళ్లంతా తప్పు చేసినవారు కాదా?

Latest Videos

vuukle one pixel image
click me!