పెద్దరికం ఏమైంది 'కోటా'.. పరువు పోతుంది మీకు అర్థమవుతుందా!

Published : May 11, 2022, 06:58 PM IST

నటుడు కోటా శ్రీనివాసరావు వ్యాఖ్యలు తరచుగా వివాదాస్పదం అవుతున్నాయి. పరిశ్రమలో కొందరు నటులు, హీరోల పట్ల ఆయన చేస్తున్న ఓపెన్ కామెంట్స్ వివాదాలకు దారి తీస్తున్నాయి. కోటా తీరు నచ్చని కొందరు ఆయన్ని విపరీతంగా విమర్శిస్తున్నారు.

PREV
17
పెద్దరికం ఏమైంది 'కోటా'.. పరువు పోతుంది మీకు అర్థమవుతుందా!
Kota Srinivasa rao

ఒకప్పుడు కోటా (Kota Srininivasarao) క్షణం తీరిక లేని నటుడు. వందల చిత్రాల్లో నటించిన కోటాకు ఇప్పుడు పని లేదు. నటుడిగా ఆయన రిటైర్ కాకున్నా కొన్ని కారణాలతో దర్శక నిర్మాతలు పక్కనబెట్టేశారు. ఎంత పెద్ద లెజెండ్ అయినా వార్ధక్యం అనుభవించాల్సిందే. వయసుతో పాటు ఆరోగ్యం సహకరించకపోవడంతో కోటాకు అవకాశాలు తగ్గిపోయాయి. కానీ కోటా వాస్తవాన్ని అంగీకరించడం లేదు. నా దగ్గర ఇంకా వయసు, ఓపికా రెండూ ఉన్నాయి. డైలాగ్ కూడా చెప్పగలను, అవకాశాలు ఇవ్వండి అంటారు. 
 

27
Kota Srinivasa rao

అలాగే తెలుగువారికి కాకుండా ఇతర భాషల నటులను ప్రోత్సహించడాన్ని తప్పుబడుతున్నారు. మనకంటే వాళ్ళు ఎందులో గొప్పంటూ నిలదీస్తున్నారు. కోటాతో అనుబంధం ఉన్న కొందరు దర్శకులు ఏదో కుర్చీలో ఉండే పాత్రలు ఇస్తున్నారు. అవి చాలా అరుదుగా వచ్చేవి కావడంతో ఆయన సంతృప్తికరంగా లేరు. ఖాళీగా ఉంటున్న కోటా యూట్యూబ్ ఛానల్స్ కి టార్గెట్ అయ్యారు. ఆయన చేసే కాంట్రవర్సియల్ కామెంట్స్ వాళ్ళు కోరుకునే మెటీరియల్ ఇస్తుంది. 
 

37
Kota Srinivasa rao


ఆ మధ్య అనసూయ బట్టలపై కోటా కామెంట్స్ చేశారు. ఆమె అందగత్తే కదా, ఎలా ఉన్నా చూస్తారు. అలాంటి చిన్న చిన్న డ్రెస్ లు వేసుకోవాల్సిన అవసరం ఏముందన్నారు. అంతే వయసులో పెద్దవాడని కూడా చూడకుండా అనసూయ కోటాను ఏకిపారేసింది. కోటా లోని లోపాలు ఎత్తి చూపుతూ సోషల్ మీడియా వేదికగా ఆయన వయసును, అనుభవాన్ని ప్రశ్నించింది. 

47
Kota Srinivasa rao


తాజాగా చిరంజీవి(Chiranjeevi), రామ్ చరణ్ గురించి ఆయన చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. చిరంజీవి సేవా గుణాన్ని కోటా ప్రశ్నించారు. కోట్లు తీసుకునే చిరంజీవి కార్మికుడు ఎలా అవుతాడు? ఆసుపత్రులు కాదు ముందు కార్మికులకు పని చూపెట్టండి. వాళ్ల కడుపు నింపండి అంటూ ఘాటు విమర్శలు చేశారు. 
 

57


అంతటితో ఆగకుండా రామ్ చరణ్ (Ram charan)నటనను కించపరిచారు. చిరంజీవి కొడుకు కావడం వలెనే ఆ స్టార్డం, ఫేమ్ లేకపోతే చరణ్ ఎవరు? అతనికి నటన రాదంటూ వివాదాస్పద కామెంట్స్ చేశారు. మెగా ఫ్యామిలీలోని ఇద్దరు హీరోలను కోటా పబ్లిక్ గా విమర్శించడం, వాళ్ళ ఇమేజ్ దెబ్బతీయడం హాట్ టాపిక్ అయ్యింది. సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ దీనిపై పెద్ద రాద్దాంతం చేస్తున్నారు. 

67
Kota Srinivasa rao

ఈ క్రమంలో కోటా తన చర్యల ద్వారా పెద్దరికం, గౌరవం కోల్పోతున్నాడనే మాట గట్టిగా వినిపిస్తుంది. ముక్కుసూటి తనం పేరుతో ఇతరులను కించపరిచేలా మాట్లాడటం సరికాదు. చిత్ర పరిశ్రమలో తెరవెనుక విషయాలు అనేకం ఉంటాయి. అవన్నీ బయటకు చెప్పి ఏదో చేయాలనుకుంటే మన పరువే పోతుంది. నటుడిగా ఎనలేని కీర్తి గడించిన కోటా జీవిత చరమాంకంలో వివాదాస్పద కామెంట్స్ ద్వారా పరువు పోగొట్టుకుంటున్నారు. 
 

77

ఒకరి ఇమేజ్ దెబ్బతీయనంత వరకు ఎటువంటి విషయాలైన ఓపెన్ గా మాట్లాడుకోవచ్చు. కానీ కోటా ఓ నటుడిని పొగుడుతూ మరొక నటుడి కించపరుస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గొప్ప నటుడు అంటూనే చరణ్ కి నటరాదని చెప్పడం ఎంత వరకు సబబు. వయసుతో పాటు పరిపక్వత రావాల్సింది పోయి, కోటాలో ఓ రకమైన అసహనం పెరిగి, ఆ తాలూకు మాటలు బయటికొస్తున్నాయి.

click me!

Recommended Stories