ధగధగమనే నగలతో పోటీపడుతున్న పూజా హెగ్డే అందం.. రాజకుమారిలా ముస్తాబై బుట్టబొమ్మ మెస్మరైజింగ్‌

First Published | Jun 11, 2022, 11:48 AM IST

బుట్టబొమ్మ పూజా హెగ్డే తరచూ హాట్‌ హాట్‌ ఫోటోలను పంచుకుంటూ కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంటుంది. కానీ ఇప్పుడు రాజహంసలా మారిపోయింది. కానీ తన అసలైన హాట్‌ నెస్‌ మాత్రం వదలడం లేదు. 

టాలీవుడ్‌ నెంబర్‌ వన్‌ స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న పూజా హెగ్డే(Pooja Hegde) తాజాగా రాజకుమారిలా తయారై దిగిన ఫోటోలను పంచుకుంది. తాను రెడీ అవుతున్న సమయంలో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా, అవి వైరల్‌ అవుతున్నాయి. చూడ్డానికి అందాల రాజహంసలా ఉంది పూజా హెగ్డే. 
 

ఇందులో ఆమె భారీ నగలు పెట్టుకుని కనిపించింది. దగదగమని మెరిసే నగలతో పూజా హెగ్డే అందాలు పోటీ పడటం విశేషం. నువ్వా నేనా అనేలా ఈ రెండూ ఉండటంతో అభిమానులు, నెటిజన్లు మైమరిచిపోతున్నారు. ఆయా పిక్స్ ని వరుసగా షేర్‌ చేస్తుండటంతో సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతున్నాయి. 


పూజా హెగ్డే ఇటీవల వరుస ఫ్లాప్‌లతో కాస్త డౌన్‌ అయ్యింది. ఆమె క్రేజ్‌ పడిపోయిందని అనుకున్నారు. కానీ ఆఫర్లు మాత్రం క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఈ డస్కీ అందాల భామ మహేష్‌బాబుతో త్రివిక్రమ్‌ చిత్రంలో నటిస్తుంది. ఇది వచ్చే వారంలో ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది. 

దీంతోపాటు పవన్‌ కళ్యాణ్‌-హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే `భవదీయుడు భగత్‌ సింగ్‌` చిత్రంలో నటిస్తుంది. మరోవైపు ఇటీవల విజయ్‌ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్న `జనగణమన`(జేజీఎం) చిత్రంలో జాయిన్‌ అయ్యింది. మరోవైపు హిందీలో సల్మాన్‌ ఖాన్‌తోనూ ఓ భారీ సినిమా చేస్తుంది పూజా. ఇలా స్టార్‌ హీరోలందరితోనూ నటిస్తూ టాప్‌ స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. 
 

టాలీవుడ్‌ అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్‌గా నిలిచింది పూజా హెగ్డే. ఇప్పుడు మరింత పెంచిందని టాక్‌. గతంలో ఆమె మూడు, మూడున్నర కోట్లు తీసుకుంటుండగా, పూరీ,విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో రూపొందుతున్న `జనగణమన` చిత్రానికి ఏకంగా నాలుగు కోట్లు డిమాండ్‌ చేస్తుందని సమాచారం. పూజా హెగ్దేకు ఉన్న క్రేజ్ తో ఆమె అడిగినంత ఇచ్చేందుకు సిద్ధంగానే ఉన్నారట పూరీ టీమ్‌. 
 

మరోవైపు ఇటీవల ఆమె ఇండిగో ఎయిర్‌లైన్‌పై ఫైర్‌ అయిన విషయం తెలిసిందే. అందులో ఒక సిబ్బంది వ్యవహరించిన తీరు పట్ల తను అసహనం వ్యక్తం చేసింది. ఎలాంటి కారణం లేకుండా మాతో పూర్తిగా అహంకారం, అజ్ఞానం మరియు బెదిరింపు టోన్ ఉపయోగించారు. సాధారణంగా నేను ఈ సమస్యల గురించి ట్వీట్ చేయను, కానీ ఇది నిజంగా భయంకరంగా ఉంది’ అంటూ ఇండిగో ఎయిర్ లైన్ సంస్థ  ను ట్యాగ్ చేస్తూ  ట్వీట్ చేసింది.

Latest Videos

click me!