థైస్‌ చూపిస్తూ పూజా హెగ్డే చిలిపి పనులు.. ఈ బుట్టబొమ్మని త్రివిక్రమ్‌ ఇప్పట్లో వదిలేలా లేరుగా!

Published : Aug 09, 2021, 06:48 PM IST

`నీ కాళ్లని పట్టుకు వదలనన్నది చూడే నా కళ్లు..` అంటూ పూజా కాళ్లల్లో అందాన్ని వర్ణించాడు బన్నీ. కానీ మాటల మాంత్రికుడు మాత్రం ఆమె కాళ్లలో గోల్డ్‌ని చూస్తున్నాడట. త్రివిక్రమ్‌కి పూజా హెగ్డే గోల్డెన్‌ లెగ్‌ అయిపోయిందట.   

PREV
19
థైస్‌ చూపిస్తూ పూజా హెగ్డే చిలిపి పనులు.. ఈ బుట్టబొమ్మని త్రివిక్రమ్‌ ఇప్పట్లో వదిలేలా లేరుగా!

పూజా హెగ్డే తాజాగా చిలిపిగా ఓ రెండు గ్లామర్‌ ఫోటోలను పంచుకుంది. థైస్‌ చూపిస్తూ ఈ అమ్మడు ఇచ్చిన క్యూట్‌ పోజులు నెట్టింట వైరల్‌గా మారాయి. తెగ ఆకట్టుకుంటున్నాయి. 

29

అయితే అందరి ఫోకస్‌ మాత్రం పూజా కాళ్లపైనే పడింది. `అల వైకుంఠపురములో` పూజా కాళ్లని ఫేమస్‌ చేశాడు అల్లు అర్జున్‌. ఏకంగా పాటే పాడి హైలైట్‌గా మార్చేశాడు. పూజా కాళ్లల్లో అంత అందం ఉందా? అనేలా చేశాడు. 
 

39

కానీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ మాత్రం చూడబోతే పూజా కాళ్లల్లో గోల్డ్ ని చూసినట్టుంది. గోల్డెన్‌ లెగ్‌గా భావిస్తున్నట్టు కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్లు. మరి ఆ కథేంటో చూస్తే. 

49

జనరల్‌గా హీరోయిన్లు నటించిన చిత్రాలు వరుసగా హిట్‌ అయితే ఆమెవి గోల్డెన్‌ లెగ్‌ అంటారు. వరుస ఫ్లాప్‌లు అయితే ఐరన్‌ లెగ్‌ అంటుంటారు. పూజా విషయంలో గోల్డెన్‌ లెగ్‌ అనే మాట బాగా వర్తిస్తుంది.

59

ఆమె నటించిన సినిమాలన్నీ విజయాలు సాధిస్తున్నాయి. ముఖ్యంగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన `అరవింద సమేత`, `అల వైకుంఠపురములో` చిత్రాలు బ్లాక్‌ బస్టర్‌ అయ్యాయి. 

69

ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తుంది. తివిక్రమ్‌కి గోల్డెన్‌ లెగ్‌ పూజా అని, ఇప్పట్లో త్రివిక్రమ్‌.. పూజాని వదిలేలా లేరుగా అంటూ సెటైర్లు వేస్తున్నారు. 

79

దీంతో ఇప్పుడు మరోసారి పూజాని రిపీట్‌ చేస్తున్నాడీ మాటల మాంత్రికుడు. మహేష్‌తో చేస్తున్న `ఎస్‌ఎస్‌ఎంబీ28` చిత్రంలో హీరోయిన్‌గా ఆమెనే ఫైనల్‌ చేశారు. ఈ విషయాన్ని కాసేపటి క్రితం వెల్లడించారు. 

89

ఏదేమైనా హిట్‌ కాంబినేషన్‌లో అంటే మార్కెట్‌ పరంగానూ కలిసొచ్చే అంశం. త్రివిక్రమ్‌ ప్లాన్ వెనకాల అది కూడా ఓ కారణంగా కావచ్చు. 

99

మరోవైపు `మహర్షి` చిత్రం తర్వాత మహేష్‌తో జోడి కడుతుంది పూజా. ఇలా ఓ వైపు త్రివిక్రమ్‌తో, మరోవైపు మహేష్‌తో పూజా కలిసి పనిచేస్తూ గత హిట్‌ మ్యాజిక్‌లను రిపీట్‌ చేయబోతున్నారని చెప్పొచ్చు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories