మహేష్‌ సంపాదన సినిమాల్లో కంటే డబుల్‌ ఆ రూపంలోనే వస్తుందట.. తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!

Published : Aug 09, 2021, 03:43 PM IST

మహేష్‌ బాబు నేడు సోమవారం తన 46వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. అందులో ఆయన సంపాదన ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారింది. 

PREV
18
మహేష్‌ సంపాదన సినిమాల్లో కంటే డబుల్‌ ఆ రూపంలోనే వస్తుందట.. తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!

మహేష్‌ ఒక్కో సినిమాకి ఇప్పుడు 60-65కోట్లు తీసుకుంటున్నాడు. ఏడాదికి ఆయన కేవలం ఒకే ఒక్క సినిమా చేస్తాడు. అంటే ఆయనకు వచ్చేది ఈ మొత్తమే అని చెప్పొచ్చు. 

28

కానీ అసలైన ఇన్‌కమ్‌ ఆయనకు మరో రూపంలో వస్తుంది. అదేంటో కాదు, యాడ్స్ రూపంలో. అవును మహేష్‌ పొందే సంపాదన బ్రాండ్‌ అంబాసిడర్‌గానే పొందుతున్నారని సోషల్‌ మీడియాలో వార్తలు వైరల్‌గా మారాయి. 
 

38

మహేష్‌ కి ఉన్న ఇమేజ్‌ని, ఫాలోయింగ్‌ని చూసి కంపెనీలు ఆయన వెంటపడుతుంటాయి. ఇలా దాదాపు పదికిపైగా బ్రాండ్లకి మహేష్‌ అంబాసిడర్‌గా చేస్తున్నాడు. 

48

ఆయన ఒక్కో యాడ్‌ చేసినందుకు రూ. ఐదు కోట్లు తీసుకుంటున్నాడని సమాచారం. సోషల్ క్యాంపెయిన్స్​లోనూ ముందుండే మహేశ్‌  ఓ ప్రముఖ పిల్లల హాస్పిటల్​కూ గుడ్​విల్​ అంబాసిడర్​గా వ్యవహరిస్తున్నాడు. 
 

58

మహేశ్‌ ఇప్పటి వరకు డెన్వర్‌ డియోడరంట్‌, ఫ్లిప్‌కార్ట్‌, క్లోజ్‌అప్‌, గోల్డ్‌ విన్నర్‌, ప్రోవోగ్‌ సూపర్‌ కలెక‌్షన్‌, ఐడియా సెల్యూలార్‌, టాటా స్కై, పారగాన్‌, టీవీఎస్‌ మోటార్‌, సంతూర్‌, అమృతాంజన్‌, రాయల్‌స్టాగ్‌, మహీంద్రా ట్రాక్టర్స్‌, సౌతిండియా షాపింగ్‌ మాల్‌, బైజూస్‌, నవరత్న, ఐటీసీ వివెల్‌ షాంపూ, జాస్‌ అలుకాస్‌, యూనివర్సల్‌ సెల్‌, ప్రోవోగ్‌, ల్యాయిడ్‌, గోద్రేజ్‌, సూర్యా డెవలపర్స్‌, కార్‌దేఖో, అభిబస్‌ ఇలా అనేక బ్రాండ్లకు ప్రచారం చేశారు. 

68

ప్రస్తుతం బైజూస్‌ నుంచి మొదలు పెడితే టూత్‌బ్రష్‌, వంటనూనె, బంగారం, బట్టలు, పెర్ఫ్యూమ్‌, బైకులు, కూల్‌డ్రింక్‌, మొబైల్స్‌, ఎలక్ట్రానిక్‌ గృహోపకరణాలు ఇలా అన్నింటా బ్రాండ్‌ అంబాసిడర్‌గా మహేష్‌ కనిపిస్తున్నారు. 

78

తన క్రేజ్‌ని వాడుకుని మహేష్‌ ఒక్కో బ్రాండ్‌ నుంచి బాగానే వసూలు చేస్తున్నాడని టాక్‌. తక్కవలో తక్కువ ఐదు కోట్లని, వాటి విలువని బట్టి ఈ పారితోషికం మారుతుందని సమాచారం. 
 

88

ఈ లెక్కన మహేష్‌ ఏడాదికి సుమారుగా ఓ వంద కోట్ల వరకు ఈ ఎండార్స్ మెంట్ల ద్వారానే వస్తుందనే ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories