ఈరోజు ఎపిసోడ్లో రాజ్యలక్ష్మి ఆ దివ్య ఈరోజే మొగుడుతో సరసాలు ఆడుతూ సంతోషంగా ఉండేది రేపటి నుంచి ఆ సంతోషాన్ని నేను దూరం చేస్తాను అనడంతో ప్రియ ఎమోషనల్ అవుతుంది. మీ కాళ్లు పట్టుకుంటాను అత్తయ్య అనగా ఈ పని నువ్వు ఇప్పుడు కాదు సంజయ్ ని పెళ్లి చేసుకోక ముందు చేయాల్సింది అని అంటుంది. నన్ను పిచ్చిదాన్ని చేసే ఆడించారు ఇప్పుడు నువ్వు అది ఇద్దరు కలిసి అనుభవించండి అని అంటుంది. ఇంతలో పని మనిషిని పిలిచి నేను చెప్పే వరకు దీన్ని ఇక్కడే బంధించండి పొరపాటున తెరిస్తే ఏమవుతుందో తెలుసు కదా అని వార్నింగ్ ఇస్తుంది. మరొకవైపు తులసి అందరూ కళ్యాణ మండపం వెళ్లడానికి సిద్ధపడుతూ ఉంటారు.