రాత్రిపూట పూజా హెగ్దే రచ్చరంబోలా.. ఫ్రాన్స్ లో తెగ ఎంజాయ్ చేస్తున్న బుట్టబొమ్మ.. వైరల్ అవుతున్న పిక్స్..

Published : May 22, 2022, 03:05 PM IST

స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే (Pooja Hegde) కాన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరైన విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో బుట్టబొమ్మ అదిరిపోయే అవుట్ ఫిట్స్ తో ఆకట్టుకుంటోంది. అయితే తాజాగా పూజా పోస్ట్ చేసిన నైట్ ఫొటోషూట్ పిక్స్  వైరల్ అవుతున్నాయి.  

PREV
16
రాత్రిపూట పూజా హెగ్దే రచ్చరంబోలా.. ఫ్రాన్స్ లో తెగ ఎంజాయ్ చేస్తున్న బుట్టబొమ్మ.. వైరల్ అవుతున్న పిక్స్..

గ్రాండ్ గా కొనసాగుతున్న 75వ కాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ను ఈ నెల 17 నుండి 28 వరకు నిర్వహించనున్నారు. ఫ్రాన్స్ లోని  కేన్స్‌ నగరంలో ఈ గ్లోబల్ ఈవెంట్ జరుగుతోంది. ఈవెంట్ కు ప్రముఖ నటీనటులు హాజరై విజయవంతం చేస్తున్నారు.  
 

26

అయితే తొలిసారి ఇండియా రిప్రెజంట్ చేస్తూ పూజా హెగ్దేకు కూడా ఈవెంట్ నుంచి ఇన్విటేషన్ అందింది. దీంతో  వారం కిందనే ఫ్రాన్స్ కు బయల్దేరిన ఈ ముద్దగుమ్మ ఫెస్టివల్ లో అట్రాక్షన్ గా నిలుస్తోంది. తన ఫ్యాషన్ సెన్స్ తో ఆకట్టుకుంటోంది. 
 

36

ఇప్పటికే ఈవెంట్ కు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే, ఐశ్వర్యా రాయ్, కమల్ హాసన్, తమన్నా భాటియా, ఏఆర్ రెహమాన్ హాజరయ్యారు. వీరితో పాటు పూజాహెగ్దే కూడా తన మార్క్ కనిపించేలా రెడ్ కార్పెట్ పై వాక్ చేస్తోంది. 

46

ఈ సందర్భంగా ఎప్పటికప్పుడు అక్కడి ఫొటోలను తన అభిమానులతో పంచుకుంటుందీ బ్యూటీ తాజాగా పూజా పోస్ట్ చేసిన పిక్స్ స్టన్నింగ్ ఉన్నాయి. కాన్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా పూజా చేసిన ఫోటోషూట్ స్మోకింగ్ హాట్ అవతార్‌ను సూచిస్తున్నాయి. క్రీమ్  కలర్ ట్రెండీ వేర్ లో మెస్మరైజ్ చేస్తోంది. 

56

అలాగే తన లగ్జరీ కారులో వెనుక సీటులో కూర్చొని స్టన్నింగ్ స్టిల్స్ ఇచ్చింది.  రాత్రి వేళ పూజా అలా చల్లగాలికి తిరుగుతుండుగా తీసిన రాండమ్ క్లిక్స్ అట్రాక్టివ్ గా ఉన్నాయి. వీటికి పూజా ‘లైఫ్ ఆన్ ద గో’ అంటూ క్రేజీగా క్యాప్షన్ ఇచ్చింది. ఈ పిక్స్ ను తన అభిమానులు ఇష్టపడుతున్నారు.   

66

ఇటీవల ‘రాధే శ్యామ్’, ‘ఆచార్య’, ‘బీస్ట్’ చిత్రాల్లో నటించింది పూజా. ప్రస్తుతం ఎఫ్3 మూవీలో స్పెషల్ అపియరేన్స్ ఇవ్వనుంది.    సూపర్ స్టార్ మహేష్ బాబు 28వ చిత్రంలోనూ పూజా నటించనున్నట్టు తెలుస్తోంది. అటు హిందీలోనూ సల్మాన్ ఖాన్‌తో  'కభీ ఈద్ కభీ దివాలీ' చిత్రంలో నటిస్తోంది. అలాగే 'సర్కస్' మూవీలోనూ నటించింది. 
 

click me!

Recommended Stories