పిల్లలకు ఏం నేర్పిస్తున్నారు.. అల్లు అర్జున్ దంపతులపై నెటిజన్ల ఫైర్, అల్లు అర్హ సమాధానంపై వివాదం

First Published | May 22, 2022, 2:35 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దంపతులపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. పిల్లలకి ఏం నేర్పిస్తున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇంతకీ అల్లువారబ్బాయిపై ఇలా ఫైర్ అవ్వడానికి కారణం ఏంటీ..? 
 

ఫిల్మ్ స్టార్ సెలబ్రెటీలు అంటే ఉండే క్రేజ్ వేరు. ఇక వారి పిల్లలన్నా కూడా అంతే క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో స్టార్ కిడ్స్ ను బాగా ఫాలో అవుతుంటారు నెటిజన్లు. వారి విషయంలో పక్కాగా స్పందిస్తుంటారు. ఇక రీసెంట్ గా అల్లు అర్జున్ గారాల పట్టి అర్హ విషయంలో కూడా నెటిజన్లు స్పందించారు.  

ఐకాన్ స్టార్ కు ఎంత క్రేజ్ ఉందో.. అల్లు అర్జున్ పిల్లలకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. బన్నీతో పాటు ఆయన భార్య స్నేహా కూడా వాళ్ళ పిల్లల వీడియోలను సోషల్ మీడియలో అప్ లోడ్ చేస్తుంటారు. ప్రతీ మూమెంట్ ను ఫ్యాన్స్ తో శేర్ చేసుకుంటుంటారు. 
 


ఇక రీసెంట్ గా అల్లు అర్హ ఒక ఈవెంట్ లో చెప్పిన సమాధానం నెటిజన్లకు కోపం తెప్పిచింది.  పిల్లలు ఇలా మాట్లాడుతున్నారు. వారికి మీరు ఏం నేర్పిస్తున్నారు. ఇలాంటివేనా చెప్పేది అంటూ మండిపడుతున్నారు. 

రీసెంట్ గా అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ ఓ చానెల్ కు ఇంటర్వ్యూ  ఇచ్చారు.. ఆ ఇంటర్వ్యూ సందర్భంగా అల్లు అర్హా తన తాత  దగ్గరకు వెళ్లింది. దీంతో ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్.. అర్హను నీ పేరేంటి అని అడిగారు. దానికి ఆ చిన్నారి అల్లు అర్హ రెడ్డి  అని సమాధానమిచ్చింది. 

ముద్దు ముద్దు మాటలతొ  అర్హ చెప్పిన ఆ సమాధానమే నెటిజన్లకు నచ్చలేదు. కులంతో సహా పేరు చెప్పడంతో షాక్ అయ్యారు. అల్లు అర్జున్ దంపతులు వారి పిల్లలకు ఏం నేర్పుతున్నారని ప్రశ్నించారు. కులం ఫీలింగ్ లేదంటూనే తన బిడ్డకు అల్లు అర్హ రెడ్డి అని చెపుతున్నారా.. అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. 

పిల్లల మనసులు సుతిమెత్తగా ఉంటాయి.. సున్నిత  భావాలుండే పిల్లల మనసులను ఇలాంటి వాటితో పాడు చేయడం ఏంటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.  అయితే ఈ విషయంలో అల్లు అర్జున్ నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు. మరి ముందు ముందు దీనిపై ఈ దంపతులు స్పందిస్తారో లేదో చూడాలి. 
 

Latest Videos

click me!