ఇంకా ఆమె చెబుతూ, పూజా చాలా సెన్సిటివ్ అట. ఆమెని ప్రతి చిన్న విషయంలోనూ జాగ్రత్త తీసుకునే వ్యక్తి కావాలని, అతడు స్ఫూర్తిగా నిలిచే వాడై ఉండాలని, కెరీర్‌ని ప్రోత్సహించాలని, అలాంటి అబ్బాయినే పూజా కోరుకుంటుందని చెప్పింది లతా హెగ్డే. అలాంటి వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొంది. దీంతో ప్రస్తుతం పూజా తల్లి చెప్పిన డిటెయిల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అలాంటి లక్షణాలున్న అబ్బాయిలకు ఇదొక బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. అయితే ఆఫర్ బాగానే ఉందిగానీ, అది మామూలు కుర్రాళ్లకి సాధ్యమా? అంటే కష్టమే, పూజా స్టార్ హీరోయిన్, ఆమెకి తగ్గ స్టేటస్, ఆస్తులు ఉన్న వ్యక్తులనే పెళ్లి చేసుకుంటారు. మీడియా ముందు ఇలానే చెబుతుంటారు. చివరికి ఏ వ్యాపార వేత్తనో చూసుకుని మ్యారేజ్ చేసుకుంటారనేది అందరికి తెలిసిందే.