ఉరి ది సర్జికల్ స్ట్రైక్ చిత్రం భారీ విజయం తర్వాత ఈ చిత్ర దర్శకుడు ఆదిత్య ధార్.. మహాభారతం టచ్ తో అశ్వద్దామ పాత్ర ఆధారంగా హై బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని ప్రకటించారు.
ఉరి ది సర్జికల్ స్ట్రైక్ చిత్రం భారీ విజయం తర్వాత ఈ చిత్ర దర్శకుడు ఆదిత్య ధార్.. మహాభారతం టచ్ తో అశ్వద్దామ పాత్ర ఆధారంగా హై బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని ప్రకటించారు.
26
ఉరి హీరో విక్కీ కౌశల్ ఈ చిత్రంలో కూడా హీరోగా నటిస్తారని అనౌన్స్ చేసారు. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు నుంచి విక్కీ కౌశల్ తప్పుకున్నారు. ఈ చిత్రానికి 'ది ఇమ్మోర్టల్ అశ్వథ్దామ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. విక్కీ కౌశల్ తప్పుకోవడంతో ఈ చిత్రానికి సరిపడే క్రేజీ హీరో కోసం ఆదిత్య ధార్ అన్వేషణ మొదలయింది.
36
ఈ చిత్రంలో హీరో ఎవరనే విషయంలో ఆదిత్య ధార్ ఒక క్లారిటీకి వచ్చినట్లు లేరు. మొదట విక్కీ కౌశల్ పేరు వినిపించగా ఆ తర్వాత రాంచరణ్, ఎన్టీఆర్,స్ షారుఖ్ ఖాన్ ల పేర్లు వినిపించాయి. వీరితో చర్చలు ప్రారంభమైనట్లు కూడా వార్తలు వచ్చాయి.
46
ఎవరు ముందుగా ఆసక్తి చూపిస్తే వారితో ఈ భారీ ప్రాజెక్టు పట్టాలెక్కించాలని ఆదిత్య ధార్ ఆలోచనలో ఉన్నారు. అయితే హీరోల విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్ సంస్థ 600 కోట్ల బడ్జెట్ లో నిర్మించనుంది.
56
తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టు లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఎంటర్ అయినట్లు తెలుస్తోంది. జియో స్టూడియోస్ సంస్థ బన్నీతో ఈ చిత్రం కోసం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 తో బిజిగా ఉన్నారు. ఆల్రెడీ బన్నీకి పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది. ఇక నుంచి బన్నీ నటించే చిత్రాలన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే ఉంటాయి.
66
మహాభారతంలోని అశ్వథామ పాత్ర ప్రధానంగా ఈ చిత్రం ఉండబోతోంది. సో బన్నీ కనుక ఈ క్రేజీ ప్రాజెక్టుకి ఒకే చెబితే మామూలుగా ఉండదని ఫ్యాన్స్ అంటున్నారు. మహాభారతం పాత్రలో అల్లు అర్జున్ పాన్ ఇండియా రికార్డులు తిరగరాయడం ఖాయం అని ఫ్యాన్స్ అంటున్నారు. ఇవన్నీ జరగాలంటే జరుగుతున్న చర్చలు ఓ కొలిక్కి రావాలి.