ఇటలీలో ‘నాగిని’ భామ అందాల రచ్చ.. సమ్మర్ వేర్స్ లో మౌనీ రాయ్ మత్తెక్కించే పోజులు..

First Published | May 15, 2023, 3:00 PM IST

‘బ్రహ్మస్త్ర’ నటి మౌనీ రాయ్ (Mouni Roy) ప్రస్తుతం వేకేషనల్ ఉన్నారు. ఈ సందర్భంగా విదేశాల్లో తన భర్తతో కలిసి రిలాక్స్ అవుతోంది. అక్కడి నుంచి పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. 
 

సీరియల్ హీరోయిన్ గా మౌనీరాయ్ తన కేరీర్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ‘నాగినీ’ డైలీ సీరియల్ తో మౌనికి బుల్లితెర ఆడియెన్స్ లో మంచి గుర్తింపు దక్కింది. దాంతో సినిమాల బాట పట్టింది. ఆఫర్లు దక్కడంతో వెండితెరపైనా మెరిసింది. 
 

నటిగానే కాకుండా స్పెషల్ అపియరెన్స్ తోనూ మౌనీరాయ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. తొలుత ‘రన్’ మూవీలో స్పెషల్ అపియరెన్స్ తో వెండితెరకు పరిచయం అయ్యింది. ‘హీరో హిట్లర్ ఇన్ లవ్, మహాయోధా రామా, తుమ్ బిన్ 2, గోల్డ్,  కేజీఎఫ్ ఛాప్టర్ 1, వంటి చిత్రాల్లో నటించింది.
 


చివరిగా బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్ - అలియా భట్ కలిసి నటించిన ‘బ్రహ్మస్త్ర పార్ట్ 1’లో కీలక పాత్ర పోషించింది. తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. దీంతో ఈ బ్యూటీకి మున్ముందుకు మరిన్ని పాత్రలు దక్కే అవకాశం ఉందని చెప్పొచ్చు. 

ఇదిలా ఉంటే.. మౌనీరాయ్ గతేడాది జనవరి 27 న వ్యాపారవేత్త సూరజ్ నంబియార్  ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గోవాలో వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. పెళ్లి తర్వాత మౌనీరాయ్ భర్తతో కలిసి వేకేషన్లు, టూర్లకు వెళ్తూ సందడి చేస్తోంది. ఆ ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది.
 

సమ్మర్ కావడంతో ప్రస్తుతం ఇటలీలో వేకేషన్ కు వెళ్లింది. ఇటలీలోని పొసిటనో అమల్ఫి కోస్ట్ టూరిస్ట్ స్పాట్ వద్ద ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా సమ్మర్ వేర్ లో దర్శనమిచ్చింది. సముద్రపు ఒడ్డున మతులు పోయేలా ఫోజులిచ్చింది. స్లిమ్ ఫిట్ గ్లామర్ షోతో కట్టిపడేసింది. 

మరోవైపు ఇటలీ నగరంలోనూ పొట్టి డ్రెస్ లో వీధులన్నీ తిరుగుతూ అందాలను వెదజల్లుతోంది. అదిరిరిపోయేలా స్టిల్స్ ఇస్తూ కుర్ర గుండెల్ని కొల్లగొట్టింది. తాజాగా ఆ ఫొటోలను అభిమానులతో పంచుకోవడంతో ఫిదా అవుతున్నారు. అలాగే నెటిజన్లు కూడా బాలీవుడ్ భామ గ్లామర్ మెరుపులకు ఖుషీ అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో ఫొటోలను వైరల్ చేస్తున్నారు. 
 

Latest Videos

click me!