ఆరెంజ్‌ కలర్‌ టైట్‌ డ్రెస్‌లో పూజా హెగ్డే పరువాల విందు.. టాప్‌ టూ బాటమ్‌ అసలైన కొలతలు చూపిస్తూ విజువల్‌ ట్రీట్

Published : Apr 11, 2023, 09:38 PM ISTUpdated : Apr 11, 2023, 09:41 PM IST

బుట్టబొమ్మ పూజా హెగ్డే జోరు మళ్లీ స్టార్ట్ అయ్యింది. బ్యాక్‌ టూ బ్యాక్‌ ఆమె అందాల విందు ఇస్తుంది. తరచూ ఫోటో షూట్లతో వార్తల్లో నిలుస్తుంది. సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది.   

PREV
19
ఆరెంజ్‌ కలర్‌ టైట్‌ డ్రెస్‌లో పూజా హెగ్డే పరువాల విందు.. టాప్‌ టూ బాటమ్‌ అసలైన కొలతలు చూపిస్తూ విజువల్‌ ట్రీట్

స్టార్‌ హీరోయిన్‌ పూజా హెగ్డే సోషల్ ఆరెంజ్‌ కలర్‌ డ్రెస్‌లో మెరిసింది. టాప్‌ టూ బాటమ్‌ కవర్‌ చేసిన ఈ వింతైన డ్రెస్‌లో ఆమె హోయలు పోయింది. ముంబయిలో స్టూడియో వద్ద ఆమె ఫోటోలకు చిక్కింది. దీంతో రెచ్చిపోయి గ్లామర్‌ షో చేసిందీ అందాల భామ. 
 

29

ముంబయిలోని కపిల్‌ శర్మ షోలో పాల్గొనేందుకు వెళ్లింది పూజా హెగ్డే. అందులో భాగంగా స్టూడియో సెట్‌ వద్ద ఆమె సందడి చేసింది. ఆరెంజ్‌ కలర్‌ డ్రెస్‌లో పూజా హెగ్డే అందాలు మరింత హాట్‌గా మారిపోగా, ఆమె అందాలను బంధించేందుకు కెమెరాలు పోటీ పడటం విశేషం. 
 

39

ఇక సల్మాన్‌ ఖాన్‌తో కలిసి పూజా హెగ్డే `కిసి కా భాయ్‌, కిసీ కీ జాన్‌` చిత్రంలో నటించింది. వెంకటేష్‌ కీలక పాత్రలో నటించిన చిత్రమిది. తెలుగులో కూడా ఇది రిలీజ్‌ కాబోతుంది. ఈ నెల 21న థియేటర్లలోకి సినిమా రాబోతున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటుంది పూజా హెగ్డే. 
 

49

అందులో భాగంగానే ఇప్పుడు సల్మాన్‌ ఖాన్‌తో కలిసి పూజా హెగ్డే.. కపిల్‌ శర్మ షోలో పాల్గొంది. వీరిద్దరు పాల్గొనగా షూటింగ్‌ ఈ రోజు జరిగింది. ఆ క్రమంలోనే సల్మాన్‌, పూజా ఇలా జంటగా ఫోటోలకు పోజులిచ్చి ఆకట్టుకున్నారు. సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

59

పూజా హెగ్డే బాలీవుడ్‌లో పాగా వేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుంది. తమన్నా, రకుల్‌ వంటి హీరోయిన్లు హిందీలో వరుస ఆఫర్లు అందుకుని అక్కడ బిజీ అవుతున్నారు. దీంతో పూజా కూడా అక్కడ రాణించేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు సల్మాన్‌తో జోడీ కట్టింది. అయితే మేకర్స్ ఈ బ్యూటీని తీసుకోవడంలో మరో కారణం ఉంది. 
 

69

పూజా హెగ్డేకి తెలుగులో స్టార్‌ ఇమేజ్‌ ఉంది. దీంతో `కిసి కా భాయ్‌.. కిసి కీ జాన్‌` చిత్రానికి తెలుగులో కలిసొస్తుందని భావించారు. అందులో భాగంగానే ఈ బ్యూటీని ఎంపిక చేసినట్టు సమాచారం. తెలుగు మార్కెట్‌ ఇప్పుడు చాలా పెద్దదైంది. ఇక్కడ సినిమా ఆడితే ఎక్కడైనా ఆడుతుందనే నమ్మకం ఏర్పడింది. అందుకే బాలీవుడ్‌ స్టార్లంతా తెలుగుపై దృష్టిపెట్టారు. అందులో భాగంగానే తెలుగు హీరోలు, హీరోయిన్లని తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 
 

79

తెలుగు ఆడియెన్స్ ముద్దుగా బుట్టబొమ్మగా పిల్చుకునే పూజా హెగ్డే ఇప్పుడు తెలుగులోనూ బిజీగా ఉన్నారు. ఆమె పవన్‌ కళ్యాణ్‌తో `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`లో నటిస్తున్నారు. మరోవైపు మహేష్‌బాబుతో కలిసి `ఎస్‌ఎస్‌ఎంబీ28` చిత్రంలో నటిస్తుంది. కొత్తగా ఈ బ్యూటీకి ఆఫర్లు రావడం లేదు. కొత్త హీరోల జోరు పెరగడంతో సీనియర్లకి అవకాశాలు తగ్గిపోతున్నాయి. అందులో పూజా కూడా ఉన్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

89

ఇక పూజా హెగ్డే గతేడాదికి ముందు వరకు తిరుగులేని స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. ఆమె పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా, ఆమె నటించిన చిత్రాలన్నీ విజయం సాధించాయి. దీంతో లక్కీ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది. కానీ గతేడాది వచ్చిన నాలుగు సినిమాలు బ్యాక్‌ టూ బ్యాక్‌ బోల్తా కొట్టడంతో సీన్‌ రివర్స్ అయ్యింది. 
 

99

ఇప్పుడు ఈ బ్యూటీని ఆ క్రేజ్‌ లేదు. దీనికితోడు కొత్త హీరోయిన్లు దూసుకొస్తున్నారు. కొత్త వారికి మేకర్స్‌ ప్రయారిటీ ఇస్తున్నారు. ఇది పూజా, రష్మిక, కీర్తి సురేష్‌ వంటి హీరోయిన్ల అవకాశాలకు దెబ్బ పడుతుందని చెప్పొచ్చు. మరి దాన్ని దాటుకుని అవకాశాలను పూజా అందుకుంటుందా, నెంబర్‌ వన్‌ స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగుతుందా? అనేది చూడాలి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories