దివి.. కవితలు బాగా రాస్తుంటుంది. తన యవ్వనాన్ని, డ్రీమ్స్ ని, కాబోయే వాడి గురించి, ఊహల్లో తేలియాడుతూ వర్ణిస్తూ తన ఫోటోలు క్యాప్షన్స్ రాస్తుంటుంది. ఆమె కవితల్లో తెలుగుదనం, తెలుగు అమ్మాయి అందం, శృంగారం, ప్రేమ, విరహం ఇలా అన్ని భావాలు కనిపిస్తుంటాయి. అందుకే ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.