పూజా హెగ్దే క్యూట్ ఫొటోలు.. నేచురల్ అందాలతో మైమరిపిస్తున్న బుట్టబొమ్మ.!

First Published Nov 17, 2023, 10:35 AM IST

స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే బ్యూటీఫుల్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఫారేన్ లో సందడి చేస్తున్న ఈ ముద్దుగుమ్మ క్యూట్ గా ఫొటోషూట్ చేసింది. లేటెస్ట్ పిక్స్ తో ఆకట్టుకుంటోంది. 
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే (Pooja Hegde) ప్రస్తుతం లండన్ లో ఎంజాయ్ చేస్తోంది. చివరిగా దివాళీ బాష్ లో కనిపించిన బుట్టబొమ్మ మళ్లీ యూనైటెడ్ స్టేట్స్ లో ప్రత్యక్షం అయ్యింది. కొద్దిరోజులుగా పూజా అక్కడే ఉంటున్న విషయం తెలిసిందే.

పూజా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నట్టు కనిపిస్తోంది. తన ఫ్యామిలీతో మాత్రం ఎప్పుడూ సందడి చేస్తూ నెట్టింట కనిపిస్తూనే ఉంది. ఈ క్రమంలో తన బ్యూటీఫుల్ ఫొటోలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటోంది. 

తాజాగా ఈ బ్యూటీ కొన్ని బ్యూటీఫుల్ పిక్స్ ను అభిమానులతో పంచుకుంది. అదిరిపోయే అవుట్ ఫిట్ లో పూజాహెగ్దే క్యూట్ గా మెరిసింది. బ్యూటీఫుల్ స్మైలో కట్టిపడేసింది. అందమైన ఫోజులతో అదరగొట్టింది.
 

చాలా రోజుల తర్వాత పూజా హెగ్దే ఇంత క్యూల్  పిక్స్ ను అభిమానులతో పంచుకోవడంతో ఖుషీ అవుతున్నారు. పూజా అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. సూర్యరశ్మిలో మరింతగా మెరిసిపోతున్న బుట్టబొమ్మను చూసి ఫిదా అవుతున్నారు. 
 

ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. పూజాను పొగడ్తలతో ఫ్యాన్స్ మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు. మరోవైపు ఆమె సినిమాల గురించి కూడా ఆరాతీస్తున్నారు. అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుపుతున్నారు. 

‘గుంటూరు కారం’ నుంచి తప్పుకున్న పూజా హెగ్దే ఇప్పటి వరకు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయలేదు. కానీ బజ్ కూడా లేదు. మరోవైపు అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ కోసమే పూజా మహేశ్ బాబు మూవీ నుంచి సైడ్ అయ్యిందని ప్రచారం. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. 
 

click me!