`ఆచార్య` ఈవెంట్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా పూజా హెగ్డే.. చీరలో కనువిందు.. కాజల్‌ లేని లోటు తీర్చిందిగా!

Published : Apr 23, 2022, 10:36 PM IST

పూజా హెగ్డే `ఆచార్య` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మెరిసింది. పలుచని ఎల్లో శారీలో కనువిందు చేస్తుంది. `ఆచార్య` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. మెగా ఫ్యాన్స్ ని తన గ్లామర్‌తో కట్టిపడేసింది. 

PREV
17
`ఆచార్య` ఈవెంట్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా పూజా హెగ్డే.. చీరలో కనువిందు.. కాజల్‌ లేని లోటు తీర్చిందిగా!
pooja hegde at acharya pre release event

చిరంజీవి, రామ్‌చరణ్‌ కలిసి నటించిన మొదటి చిత్రం `ఆచార్య`. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే చిన్న పాత్ర పోషించింది. రామ్‌చరణ్‌కి జోడీగా చేసింది. చిరంజీవికి కాజల్‌ జత కట్టిన విషయం తెలిసిందే. 

27

`ఆచార్య` చిత్రం ఈ నెల 29న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కి పూజా హెగ్డే హాజరయ్యింది. స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. 

37

ఇందులో పూజా హెగ్డే చీరలో కనువిందు చేస్తుంది పూజా. ట్రాన్సఫరెన్స్ శారీలో కట్టిపడేస్తుంది. మెగా ఫ్యాన్స్ ఈ దెబ్బతో తన బుట్టలో వేసుకుంటుందీ బుట్టబొమ్మ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చిన్న రోల్‌ చేసి కూడా ఈవెంట్‌లో పాల్గొనడం విశేషం. 

47

ఇదిలా ఉంటే ఇందులో మెయిన్‌ హీరోయిన్‌గా చేసిన కాజల్‌ ప్రస్తుతం రాలేని పరిస్థితిలో ఉంది. ఆమె ఇటీవల మగబిడ్డకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆమె బయటకు రాలేని స్థితిలో ఉంది. ఆ లోటుని ఇప్పుడు పూజా హెగ్డే తీర్చిందని చెప్పొచ్చు. 
 

57

ఇక ఈ `ఆచార్య` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న పూజా హెగ్డే మాట్లాడుతూ, చిరంజీవిపై ప్రశంసలు కురిపించింది. సెట్‌లో చిరంజీవి గ్రేస్‌, డైలాగ్‌ డెలివరీ అద్భుతంగా ఉంటాయి. ఒక ఆరా వ్యాపించినట్టుగా ఉంటుందని తెలిపింది. 
 

67

రామ్‌చరణ్‌ గురించి చెబుతూ, ప్రతి సినిమాకి నటుడిగా ఎదుగుతున్నాడని, ఇందులో అద్భుతంగా చేశాడని తెలిపింది. ఆయన నటన కట్టిపడేస్తుందని వెల్లడించింది. ఆయనతో తెరని పంచుకోవడం ఆనందంగా ఉందని చెప్పింది పూజా. చరణ్‌తో మరో సినిమా చేయాలని కోరుకుంటున్నట్టు వెల్లడించింది. 
 

77

`ఆచార్య` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పూజా హెగ్డే ఆద్యంతం ఆకట్టుకుంటూ, ఈవెంట్‌కి గ్లామర్‌ని తీసుకొచ్చింది. ఇప్పుడు ఆమె ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories