పవన్ కళ్యాణ్ - హరీశ్ శంకర్ ప్రాజెక్ట్ నుంచి పూజా హెగ్దే అవుట్.. బుట్టబొమ్మకు భారీ షాకే!

First Published | Dec 15, 2022, 5:09 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - హరీశ్ శంకర్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మూవీలో హీరోయిన్ పూజా హెగ్దే నటిస్తుందనే ముందుగానే ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా మరో న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.
 

‘గబ్బర్ సింగ్’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు హరీశ్ శంకర్ మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను తెరకెక్కిస్తున్నారు. 16 ఏండ్ల తర్వాత ఈ క్రేజీ కాంబో మళ్లీ సెట్ అవడంతో అభిమానులు  ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరోసారి పవన్ మాసీజానికి థియేటర్లు దద్దరిల్లి పోనున్నాయి. 
 

రీసెంట్ గా Ustad Bhagatsingh చిత్రం సెట్స్ పైకి వెళ్లింది. ఇప్పటికే మూడు రోజుల పాటు షూటింగ్ విజయవంతంగా కొనసాగుతోంది. రామానాయుడు స్టూడియోలో వేసిన భారీ సెట్లో చిత్రీకరణ జరుగుతోంది. ఫస్ట్ షెడ్యూల్ ను నెల 20 తేదీ వరకు కొనసాగించనున్నారని సమాచారం. 
 


ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో హీరోయిన్ గా పవన్ కళ్యాణ్ సరసన పూజా హెగ్దే (Pooja Hegde) నటిస్తుందని తొలుత ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా సమాచారం ప్రకారం.. బుట్టబొమ్మ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని తెలుస్తోంది. ఇప్పటికే వరుస ఫ్లాప్స్ ను మూటగట్టుకున్న ఈ బ్యూటీకి దీంతో షాక్ తగిలిందనే చెప్పాలి. 
 

ఇప్పటికే ‘రాధే శ్యామ్’ ఫ్లాప్ కావడం, అటు ‘జన గణ మన’ ఆగిపోవడంతో ఐరెన్ లెగ్ అనే ప్రచారం జరిగింది. దీంతో మేకర్సే బుట్టబొమ్మను పక్కకు పెట్టారని చర్చ జరుగుతోంది. మరోవైపు డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల తప్పుకుందనే కోణమూ వినిపిస్తోంది. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. 
 

ప్రస్తుతం పవర్ స్టార్ క్రిష్ దర్శకత్వంలోని ‘హరిహర వీరమల్లు’లో నటిస్తున్న విషయం తెలిసిందే. తుదిదశ చిత్రకరణ జరుగుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఎప్పటి నుంచో వెయిటింగ్ లో ఉన్న హరీశ్ శంకర్ తోనూ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను ప్రారంభించారు. 

అభిమానుల్లో మరింత జోష్ పెంచేందుకు యంగ్ డైరెక్టర్ సుజీత్ తోనూ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక అటు పొలిటికల్ ప్రొగ్రామ్స్ నూ చూసుకుంటూ బిజీగా ఉంటున్నారు. వచ్చే ఏడాది పవన్ - నిధి అగర్వాల్ జంటగా నటిస్తున్న  ‘హరిహర వీరమల్లు’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Latest Videos

click me!