మరోవైపు ఈ సందర్భంగా తన పెళ్లికి ముందు తనలవ్ స్టోరీని పంచుకున్నారు అలీ. పెళ్లికి ముందు ఏవైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా? అని ప్రశ్నించగా, సిగ్గులు మొగ్గేశాడు అలీ. ఓ రోజు తమ పక్కింటి అమ్మాయి వర్షంలో తడుస్తూ వస్తుందని, ఆమెని చూసిన అలీ, తన చెల్లితో గొడుగు ఇచ్చి పంపించారట. ఆ తర్వాత ఆమె వర్షం లేకపోయినా ఆ గొడుగు పట్టుకుని తన ఇంటి ముందు నుంచి వెళ్లేదని చెప్పారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది కూడా సస్పెన్స్ లో పెట్టారు అలీ. మరోవైపు సుమ, అలీ మధ్య జరిగిన కన్వర్జేషన్, పంచ్ లు, సెటైర్లు నవ్వులు పూయించాయి.