మాల్దీవుల్లో జాలీగా బుట్టబొమ్మ.. సైకిల్ ఎక్కి సందడి చేస్తున్న పూజా హెగ్దే.. పిక్స్

First Published | Oct 15, 2023, 1:51 PM IST

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్దే తన పుట్టినరోజు కోసం మాల్దీవుల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తూ బ్యాక్ టు బ్యాక్ ఫొటోలను పంచుకుంటోంది. నెట్టింట రచ్చ చేస్తోంది. 
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే (Pooja Hegde)  పుట్టిన రోజు వేడుకలను మాల్దీవుల్లో జరుపుతుంది. చాలా సింపుల్ గా సెలబ్రేట్ చేసుకుంది. నిన్నటితో ఈ ముద్దుగుమ్మ 33వ ఏటా అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తనకు విషెస్ తెలిసిన వారికి పూజా ధన్యవాదాలు తెలిపింది.
 

తన బర్త్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా మాల్దీవులకు వెళ్లిన పూజా హెగ్దే అక్కడి నుంచి బ్యాక్ టు బ్యాక్ ఫొటోలను పంచుకుంటోంది. నిన్నటి వరకు బీచ్ లో వేర్ లో దుమ్ములేపిన ఈ ముద్దుగుమ్మ తాజాగా మరిన్ని ఫొటోలను పంచుకుంది. 


మరోసారి తనకు శుభాకాంక్షలు తెలిపిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. అభిమానుల మెసేజెస్ కూడా స్పందిస్తానని కూడా చెప్పింది. ఈ సందర్భంగా మరికొన్ని బ్యూటీఫుల్ ఫొటోలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. మాల్దీవుల్లో సందడి చేస్తూ కనిపించింది. 

లేటెస్ట్ ఫొటోస్ లో పూజా హెగ్దే చాలా హ్యాపీగా, సరదాగా కనిపించింది. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ రిలాక్స్ అవుతున్న బుట్టబొమ్మ బైస్కిల్ పై తిరుగుతూ రచ్చ చేసింది. ఈ సందర్భంగా ఫొటోలకు ఫోజులిచ్చింది. క్యాజువల్ డ్రెస్ లో కూల్ లుక్ ను సొంతం చేసుకుంది. మరోవైపు టాప్ గ్లామర్ తో కట్టిపడేసింది.
 

ప్రస్తుతం వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఫొటోలను షేర్ చేస్తూ తన గురించిన అప్డేట్స్ ను అభిమానులకు అందిస్తూ వస్తోంది. ఇక సినిమాల విషయాలపై మాత్రం ఇప్పటికీ అప్డేట్ ఇవ్వడం లేదు. చివరిగా హిందీ ఫిల్మ్ ‘కిసి కా బాయ్ కిసికీ జాన్’ చిత్రంతో అలరించింది.

టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబోలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘గుంటూరు కారం’ నుంచి తప్పుకుంది. ఆ మధ్యలో విజయ్ దేవరకొండ సరసన చేయాల్సిన ‘జన గణ మన’ కూడా ఆగిపోయిన విషయం తెలిసిందే. తన లాస్ట్ నాలుగు సినిమాలూ పెద్దగా హిట్ అందుకోలేకపోయాయి. ఇలాంటి సిచ్యుయేషన్ లో బుట్టబొమ్మ నెక్ట్స్ స్టెప్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
 

Latest Videos

click me!