బాలకృష్ణ సినిమాల్లో ఇదివరకు చూడని ఓ కొత్త నేపథ్యాన్ని ఇందులో ఆవిష్కరించారు. వీటన్నిటికీ తోడు బాలకృష్ణ మాస్ అంశాలు ఉండనే ఉన్నాయి. ఇవి నార్త్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయని అంతా భావించారు. అయితే రిజల్ట్ మరో రకంగా ఉంది.
Nandamuri Balakrishna Daaku Maharaj collection report out
గత సంక్రాంతికి 2023లో ‘వీరసింహారెడ్డి’ బరిలో దిగి విజయాన్ని అందుకున్న బాలయ్య ఇప్పుడు ‘డాకు మహారాజ్’ తో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. మాస్ సినిమాలకి పెట్టింది పేరైన యువ దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కించారు.
సినిమా లో స్టైలిష్ యాక్షన్ కనిపించింది కానీ ఫ్యాన్స్ కోరుకున్న మాస్ బాలయ్య తక్కువయ్యాడనే కామెంట్స్ వినిపించాయి. అయితే తెలుగు రెండు రాష్ట్రాల్లోను ‘డాకు మహారాజ్’తో (Daku Maharaj ) బాగానే వర్కవుట్ అయ్యిందని ట్రేడ్ అంటోంది. ఇప్పుడు హిందీకు వెళ్లింది.
23
Balayyas Daaku Maharaaj collection report out
నార్త్ లో డాకు మహారాజ్ ని ఈ జనవరి 24 నుంచి థియేటర్స్ లో దింపారు. కథ లో చాలా భాగం నార్త్ ఆడియన్స్ తగినట్లే రూపొందించారు. అలాగే 1980లో దాదాపు దశాబ్దన్నర పాటు పోలీసుల్ని, రాజకీయ నాయకుల్ని ముప్పుతిప్పలు పెట్టిన మాన్ సింగ్ (‘డాకు సింగ్’)బయోగ్రఫీని రిఫరెన్స్ గా పెట్టుకుని ఈ డాకు మహారాజ్ రూపొందించారు. దాంతో అక్కడ జనాలకు ఈ సినిమా బాగా ఎక్కుతుందని, ఎగబడి చూస్తారని భావించారు.
33
Nandamuri Balakrishnas Daaku Maharaj collection report out
అయితే డాకు మహారాజ్ చిత్రం హిందీ భాక్సాపీస్ దగ్గర ఏ మాత్రం సందడి చేయటం లేదు. ఈ చిత్రం మొదటి రోజు కలెక్షన్స్ కేవలం ఐదు లక్షలే కావటం అభిమానులను బాగా నిరాశపరుస్తోంది. ఇంత తక్కువ కలెక్షన్స్ ఎవరూ ఊహించలేదు. దాంతో హిందీ బెల్ట్ లో ఈ సినిమా డిజాస్టర్ గా నిలుస్తుందని అక్కడ ట్రేడ్ అంటోంది. అక్కడ ఊర్వశి రౌతాలా కూడా ఏమీ మ్యాజిక్ చెయ్యలేకపోయింది. దాంతో సినిమా వీకెండ్ కూడా వర్కవుట్ కాలేదు.