ఉమైర్ సంధు తాజాగా పూజా హెగ్డే గురించి గురించి చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. పూజా హెగ్డే, కండల వీరుడు సల్మాన్ ఖాన్ మధ్య ప్రస్తుతం లవ్ అఫైర్ కొనసాగుతున్నట్లు ఉమైర్ సంధు ట్వీట్ చేశారు. బిటౌన్ లో కొత్త ప్రేమ మొదలైంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పూజా హెగ్డే ప్రేమలో పడ్డారు. ప్రస్తుతం వీరిద్దరూ ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే సల్మాన్ ఖాన్ తో 'కిసీకా భాయ్ కిసీకి జాన్' అనే చిత్రంలో నటిస్తున్నారు.