నల్లపిల్లీ అంటూ అవమానించేవారు... ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు

Published : Dec 07, 2022, 11:41 PM IST

బాలీవుడ్ నుంచి వెళ్లి హాలీవుడ్ లో సెటిల్ అయ్యింది ప్రియాంక చోప్రా. ఇండియన్స్ మీద బాగా కోపం పెంచుకున్నట్టుంది. ఇక్కడ జరిగిన అవమానాలను ఒక్కొక్కటిగా బయటపెడుతుంది బ్యూటీ. 

PREV
18
నల్లపిల్లీ అంటూ అవమానించేవారు... ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు

తన ప్రొఫిషన్ లో చాలా రకాల  సమస్యలు ఎదుర్కొన్నట్లు పేర్కొంది ప్రియాంక చోప్రా. మూడేళ్ల తరువా ఇండియాకు వచ్చిన ప్రియాంక హాట్ హాట్ కామెంట్స్ తో అందరిని ఆశ్చర్యపరుస్తోంది.  ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెన్సేషనల్ విషయాలు వెల్లడించింది. 

28

తనకు చాలా ఈజీగా అవకాశాలు రాలేదంటోంది ప్రియాంక. నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన రోజుల్లో తను చాలా అవమానాలు అనుభవించానంటోంది బ్యూటీ. తనను డస్కీ అంటూ పిలిచేవారని.. అలా ఎందుకు పిలుస్తున్నారో అర్ధం కాలేదంటుంది. అంతే కాదు. సెట్ లో చాలా మంది కోసం తనను వెయిటింగ్ లో పెట్టావారంటోంది ప్రియాంక. 

38

ఇక తనను నల్లపిల్లీ అంటూ వెంటకారంగా పిలిచేవారని..రకరకాలుగా తనను అవమానించారని.. తన కలర్ వల్ల చాలా మాటలు పడ్డానంటోంది.  అంతే కాదు గంటల తరబడి తనను వెయిటింగ్ చేయించేవారంటూ అప్పటి అనుభవాలు వెల్లడించింది ప్రియాంక. అంతే కాదు వాటి నుంచి తనను తాను కాపాడుకోవడం కోసం ఆత్మవిశ్వాసంతో పనిచేశానంటోంది ప్రియాంక.  

48

ఇక్కడ కొందరు తన టాలెంట్ ను తనఫిల్మ్  కెరీర్ ను చంపేయడానికి  చాలా ట్రై చేశారని సంచలన విషయాలు తెలిపింది. అంతేకాదుఇక్కడ తనకు  పని దొరకకుండా ఇండస్ట్రీ నుంచి బయటకు పంపాలని విశ్వ ప్రయత్నాలు చేశారని బాధపడింది ప్రియాంక. 
 

58

2000 సంవత్సరంలో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ప్రియాంక .. మిస్ ఇండియాగా ఎన్నికయ్యింది. వృత్తిపరంగా  ఎవరూ ఇంత వరకూ పడని ఇబ్బందులు, కష్టాలు పడ్డట్టు.. అనేక సమస్యలు ఎదుర్కొన్నట్లు  తెలిపింది. 2002 లో సన్నీడియోల్ హీరోగా వచ్చిన ద హీరో సినిమాతో తెరంగేట్రం చేసింది బ్యూటీ.. 
 

68
Priyanka chopra

ఇలాంటి ఎన్నో టఫ్ సిట్యుయేషన్స్ ను ధైర్యంగా ఎదుర్కొని ఇంతటి స్థాయికి ఎదగలిగానని ..ఎలాంటి పరిస్థితి వచ్చినా.. ఎవరు తనను తొక్కేయాలని చూసినా.. అది జరిగే పని కాదు.. తనను ఏ శక్తి ఆపలేదని ఆమె స్పష్టం చేసింది . కాగా ప్రియాంక చోప్రా మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి . అంతేకాదు కొందరు ఆమె మాటల పై ఫైర్ అవుతున్నారు. 
 

78

బాలీవుడ్ హీరోయిన్గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ అమ్మడు మిస్ వరల్డ్ టైటిల్ తో బాలీవుడ్ ను షేక్ చేసింది . అయితే మిస్ వరల్డ్ టైటిల్ అందుకున్నా కానీ బాలీవుడ్లో అమ్మడుకు సరైన అవకాశాలు రాలేదు. పాశ్చాత్య దేశాలలో ని ప్రేక్షకులు అమ్మడు అందాలకి ఫిదా అయ్యారే కానీ ..బాలీవుడ్ జనాలు అంతగా పట్టించుకోలేదు . 

88

2017 లో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక చోప్రా.. అమెరికన్ పాప్ సింగర్...నిక్ జోనస్ తో ప్రేమలో పడింది. తనకంటే కూడా పదేళ్లు చిన్నవాడైన నిక్ ను పెళ్లాడి అక్కడే సెటిల్ అయ్యింది. 

Read more Photos on
click me!

Recommended Stories