త్రివిక్రమ్, పూజ హెగ్డే కాంబినేషన్లో ఇప్పటికే 'అరవింద సమేత', 'అలవైకుంఠపురంలో' వంటి సినిమాలు వచ్చి సక్సెస్ అయ్యాయి. దాంతో అంతవరకూ సమంతను ఎంకరేజ్ చేస్తూ వచ్చిన త్రివిక్రమ్ రూట్ మార్చారు. అక్కడ నుంచీ పూజ హెగ్డే త్రివిక్రమ్ కి గోల్డెన్ హీరోయిన్గా మారిపోయింది. ఈ లోగా ఓ ట్విస్ట్ పడింది. రీసెంట్ టైమ్స్ లో పూజ హెగ్డే వరుస ప్లాప్స్ అందుకుంది.
అయినా కూడా త్రివిక్రమ్ మహేష్ బాబుతో చేస్తున్న ‘గుంటూరు కారం’ సినిమాలో హీరోయిన్‌గా తీసుకున్నారు. కానీ ఈ మధ్య పూజా హెగ్డే మహేష్ బాబు 'గుంటూరు కారం' సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. మహేష్ బాబు వద్దన్నారంటూ వార్తలు వచ్చాయి. అదేమీ లేదు కావాలనే పూజ తప్పుకుంది అన్నారు.
Pooja Hegde
గుంటూరు కారం సినిమాలో ఆమె పాత్ర చాలా తక్కువ ఉంటుందని. ప్రాధాన్యత కూడా అంతగా ఉండదని. శ్రీలీలకు ఎక్కువ స్కోప్ ఉండటంతో ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నారని వార్తలు వచ్చాయి.కానీ ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది. ఈ మూవీ షూటింగ్ కు ఎప్పటికప్పుడు బ్రేక్ పడుతూ వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా చాలా ఆలస్యం అయ్యింది.
దాంతో పూజ హెగ్డేకు డేట్స్ విషయంలో సమస్య ఎదురయ్యి తప్పుకుంది అన్నారు. ఏది ఏమైనా పూజ తప్పుకుంది అనేది నిజమై కూర్చుంది. అయితే త్రివిక్రమ్ క్యాంప్ హీరోయిన్ అన్న ముద్ర ఉన్న పూజా తప్పుకోవడం ఎవరూ ఊహించలేదు. అయితే ఇప్పుడు పూజ మళ్లీ సినిమాలోకి వచ్చిందని సమాచారం. ఇదెలా సాధ్యం..
వాస్తవానికి వేసవి టైమ్ లో పెట్టుకున్న గుంటూరు కారం షెడ్యూల్స్ అన్నీ.. మహేష్ బాబు షూటింగ్ కు రాక ఆగిపోయాయి. గత నెలలో అతను షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఇక అంతా ఓకే అనుకుంటోన్న టైమ్ లో ఇప్పుడు మళ్లీ పూజాహెగ్డే గుంటూరు కారంలోకి రీ ఎంట్రీ ఇస్తుందనే వార్త సర్ ప్రైజింగ్ గా ఉంది.
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ...పూజాహెగ్డే మళ్లీ గుంటూరు కారం టీమ్ తో జాయిన్ కాబోతోందనే వార్త నిజమే అంటున్నారు. కాకపోతే హీరోయిన్ గా కాదు. ఐటమ్ గాళ్ గా అని వినపడుతోంది.
ఇదీ త్రివిక్రమ్ కొత్త స్కెచ్ అంటున్నారు. మొదట స్క్రిప్టులో లేదు కానీ ఇప్పుడు ఈ మూవీలో ఓ ఐటమ్ సాంగ్ ఉందట. ఆ పాట కోసం పూజా హెగ్డేను సంప్రదించారని తెలుస్తోంది. దీనికి ఆమె కూడా ఓకే అన్నట్టు టాక్. పూజకు ఐటం సాంగ్ చేయటం ఇష్టం ఉందా లేదా అనేది ప్రక్కన పెట్టి ఒప్పుకునేందుకు ఆస్కారం ఉన్న అంశంగా రెమ్యూనరేషన్ ను చెబుతున్నారు.
గుంటూరు కారం మూవీలో తనను హీరోయిన్ అనుకున్నప్పుడు హారిక హాసిని బ్యానర్ భారీ చెక్ నే అడ్వాన్స్ గా ఇచ్చారట. ఇప్పుడా అడ్వాన్స్ ను తిరిగి తీసుకోవడం కంటే తనతో ఓ ఐటమ్ సాంగ్ చేయిస్తే బావుంటుందనే సంప్రదించారట.అటు పూజా కూడా అంత పెద్ద చెక్ ను వెనక్కి ఇవ్వడం కంటే ఓ మూడు నాలుగు రోజులు పాట చేస్తే అయిపోతుంది కదా అని ఓకే చెప్పేసిందంటున్నారు. ఈ పాటను ఈ యేడాది డిసెంబర్ లో చిత్రీకరిస్తారట.
ఇక పూజా హెగ్డే ని తీసేసి ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అనుకున్న శ్రీ లీలను మెయిన్ హీరోయిన్ ఫిక్స్ గా చేశారని, అలాగే రెండవ హీరోయిన్‌గా మీనాక్షి చౌదరిని తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఇంకా మూవీ టీం నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
గత కొంతకాలంగా సోషల్ మీడియా అంతటా త్రివిక్రమ్ హాట్ టాపిక్ గా మారుతున్నారు. త్రివిక్రమ్ పై ట్రోల్స్ ఎందుకు వస్తున్నాయంటే? అందుకు కారణం మన బుట్ట బొమ్మ పూజ హెగ్డే అని అంటున్నారు. 'బ్రో' టీజర్ కు ముందు పూజా హెగ్డే నటించిన ఓ కమర్షియల్ యాడ్ ఇప్పుడు నెటిజన్ల కంటపడింది.
దాంతో పూజ హెగ్డే లేనిదే గురూజీ సినిమా చేసేలా లేరుగా? అంటూ త్రివిక్రమ్ ని ఆడేసుకుంటున్నారు. మరి కొంతమంది నెటిజెన్స్ అయితే ఈ యాడ్లో నటించేందుకే పూజా హెగ్డే ను మహేష్ బాబు 'గుంటూరు కారం' సినిమా నుంచి తప్పించి ఉంటారంటూ చెబుతున్నారు.
'బుట్ట బొమ్మను వదిలేదేలే', 'పూజ హెగ్డే లేనిది గురూజీ సినిమాలు తీయరా?', 'ఏదో విధంగా బుట్ట బొమ్మ కనిపించాల్సిందే', 'త్రివిక్రమ్ లక్కీ హీరోయిన్ పూజ హెగ్డే' అంటూ రకరకాల కామెంట్స్ తో నెటిజెన్స్ త్రివిక్రమ్ పై ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు.
ఇక పూజా హెగ్డే మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా క్యూట్ అండ్ హాట్ అందాలు కుర్రాళ్లకు నిద్ర దూరం చేస్తుంటాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూజా హెగ్డే తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది. పూజా హెగ్డే గ్లామర్ లుక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్కై బ్లూ కలర్ టైట్ ఫిట్ గౌనులో పూజా హెగ్డే తన పరువాలు ఒలకబోస్తున్న విధానం మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి.
పూజ మాత్రం ఎన్ని వార్తలు తనపై వచ్చినా డోంట్ కేర్ అంటుంది. హీరోయిన్ గా అగ్ర స్థానాన్ని నిలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది పూజా హెగ్డే. గతేడాది వరుస అపజయాలు ఎదురైనా స్థిరంగా కెరీర్ మీద దృష్టి సారిస్తున్నది. ప్రస్తుతం తను చేస్తున్న రెండు భారీ చిత్రాలపై పూజా ఆశలు పెట్టుకుంది.
ప్రతి సినిమాకు కష్టపడి పనిచేస్తామని, దాని ఫలితం నిర్ణయించలేమని అంటున్నదీ నాయిక. వైవిధ్యమైన పాత్రల్లో నటించే అవకాశం దక్కడమే తనకు సంతృప్తినిస్తుందని చెప్పుకుంది. పూజా హెగ్డే గ్లామర్ లుక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. పూజా హెగ్డే ఇస్తున్న ఫోజులు కిరాక్ అంతే. అవకాశాలు తగ్గడంతో పూజా హెగ్డే ఇలా గ్లామర్ డోస్ పెంచేస్తోందా అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పూజా హెగ్డే మాట్లాడుతూ…‘నేనెలా కనిపిస్తాను అనే దానికంటే నా పాత్రకు తగినట్లు ఉండేందుకు ప్రయత్నించాను. నేను పక్కింటి అమ్మాయిలా కనిపించగలను. ఆధునిక యువతిగా మెప్పించగలను. ఒక టీచర్‌గా, చారిత్రక నేపథ్య మహిళగా నటించగలను. భిన్నమైన ఈ పాత్రలన్నీ నటిగా నాలోని వెర్సటాలిటీని చూపించాయి. నాలో దైవభక్తి ఎక్కువగా లేదు గానీ మనల్ని ఏదో బలమైన శక్తి నడిపిస్తుందని నమ్ముతుంటా.’ అని చెప్పింది.
మత్తుగా గ్లామర్ లుక్స్, పొడుగుకాళ్లతో పూజా హెగ్డే చేసే మ్యాజిక్ కి కుర్రాళ్లు మాయలో పడిపోతున్నారు. ఇక పూజా హెగ్డే షూటింగ్స్ కి విరామం దొరికినప్పుడు ఏ మాల్దీవులకో వెకేషన్స్ కి వెళుతూ ఎంజాయ్ చేస్తోంది. అలాగే గ్లామర్ ఫోటోషూట్స్ తో ఇంటర్నెట్ లో మంటలు రేపుతూ ఉంటుంది.