ఆ మాటలు విన్న రాజ్ రుద్రాణిని కోప్పడతాడు. అలా ఏ అత్తింటివారైనా చేస్తారా అని నిలదీస్తాడు. మరి ఏం చేయమంటావు ఇది ఎప్పుడు ఏదో ఒక తింగరి పనిచేసే నెత్తి మీదకి తీసుకొస్తుంది అంటుంది రుద్రాణి. తను అలా చేయకుండా చూడవలసిన బాధ్యత మన అందరిదీ.. ముఖ్యంగా అత్తగారిగా భర్తగా మీ ఇద్దరి మీద ఆ బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుంది అని రుద్రాణికి, రాహుల్ కి చెప్తాడు రాజ్.