`గుంటూరు కారం`లో పూజా హెగ్డే.. అన్‌సీన్‌ స్టిల్స్ వైరల్‌.. మహేష్‌కి జోడీగా బుట్టబొమ్మ ఉంటే ?

Published : Mar 03, 2024, 06:11 PM ISTUpdated : Mar 03, 2024, 06:13 PM IST

మహేష్‌ బాబు ఇటీవల `గుంటూరు కారం`తో వచ్చాడు. సంక్రాంతికి ఈ మూవీ విడుదలైంది. ఇందులో శ్రీలీల హీరోయిన్‌. అయితే పూజా హెగ్డే ఆమె స్థానంలో ఉంటే ఎలా ఉండేదంటే?  

PREV
16
`గుంటూరు కారం`లో పూజా హెగ్డే.. అన్‌సీన్‌ స్టిల్స్ వైరల్‌.. మహేష్‌కి జోడీగా బుట్టబొమ్మ ఉంటే ?

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో `గుంటూరు కారం` సినిమా రూపొందింది. `అతడు`, `ఖలేజా` చిత్రాల తర్వాత ఈ కాంబోలో వచ్చిన మూవీ ఇది. సంక్రాంతికి విడుదలై నిరాశ పరిచింది. ఈ సినిమాపై విపరీతమైన నెగటివిటీ సినిమాని దెబ్బ కొట్టింది. దీనికితోడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ స్థాయిలో సినిమా లేదని, ఎమోషన్స్ వర్కౌట్‌ కాలేదని, డైలాగ్‌లు కూడా పెలేలా లేదనే విమర్శలు వచ్చాయి. 
 

26

మొత్తానికి సంక్రాంతి సందర్భంగావిడుదలైన ఈ మూవీ కలెక్షన్ల పరంగానే బాగానే మెప్పించారు. కానీ బ్రేక్‌ ఈవెన్ కాలేకపోయింది. దీంతో బయ్యర్లకి నష్టాలను చవిచూసింది. అయితే మహేష్‌ బాబు సరసన ఈ మూవీలో హీరోయిన్‌గా పూజా హెగ్డే అనుకున్నారు. కానీ ఆ తర్వాత తీసేశాడు. తాజాగా ఆ స్టిల్స్ వైరల్‌ అవుతున్నాయి. 
 

36

మొదట `గుంటూరు కారం` చిత్రంలో పూజా హెగ్డే మెయిన్‌ హీరోయిన్‌. ఆమెపై కొన్ని రోజులు షూటింగ్‌ కూడా చేశారు. కానీ మధ్యలో ఆపేశారు. సరైన ఔట్‌పుట్‌ రాలేదని క్యాన్సిల్‌ చేశారు. ఫైట్‌ సీన్లు, కంటెంట్‌ పరంగానూ మహేష్‌ అభ్యంతరం తెలిపాడని, దీంతో సినిమాని క్యాన్సిల్‌ చేశారు. ఆ తర్వాత మొత్తం కథే మారిపోయిందట. ఇప్పుడు తీసింది మొదట అనుకున్న కథ కాదని సమాచారం. 
 

46

  దీనికితోడు మహేష్‌, త్రివిక్రమ్‌ మధ్య క్రియేటివ్‌ డిఫరెంట్స్ కారణంగా హీరోయిన్‌ని కూడా మార్చేశారు. పూజా ని పక్కన పెట్టారు. అప్పటి వరకు సెకండ్‌ హీరోయిన్‌గా అనుకున్న శ్రీలీలని మెయిన్‌ హీరోయిన్‌ ని చేశారు. సెకండ్‌ హీరోయిన్‌గా మీనాక్షి చౌదరిని ఎంపిక చేశారు.

56

అలా పూజా హెగ్డే సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇది కూడా ఓ రకంగా పూజాకి మంచే జరిగింది. పరాజయం నుంచి తప్పించుకుంది. అయితే పూజా ఉంటే బాగుండేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. సినిమా రేంజ్‌ వేరే లెవల్‌లో ఉండేదంటున్నారు. 

66

కానీ కెరీర్‌ పరంగా మాత్రం పెద్ద దెబ్బనే పడింది. ఆ తర్వాత ఆమె వరుసగా రెండు మూడు ఆఫర్లు పోయాయి. పవన్‌, హరీష్‌ శంకర్‌ల `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` చిత్రం నుంచి కూడా తప్పించారు. అలాగే `గంజా శంకర్‌` ఆగిపోయింది. ఇలా వరుసగా మూడు నాలుగు సినిమాలు పోవడంతో పూజా ఖాళీ అయిపోయింది.  
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories