మహేశ్ బాబు (Mahesh Babu) రీసెంట్ గా ‘గుంటూరు కారం’ (Guntur Kaaram)తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మిశ్రమ స్పందనను దక్కించుకుంది. అయినా మంచి రిజల్ట్ ను అందుకుంది.
నెక్ట్స్ హాలీవుడ్ రేంజ్ లో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) డైరెక్షన్ లో అడ్వేంచర్ ఫిల్మ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా షూటింగ్ కు బాబు సిద్ధమవుతున్నారు. తగిన శిక్షణ తీసుకుంటున్నారు.
SSMB29పై ఆడియెన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికీ మహేశ్ బాబు నటించిన సినిమాలు ఒకెత్తైతే.. ఇప్పటి నుంచి చేయబోయే సినిమాలు మరో ఎత్తు అంటున్నారు. ఈ క్రమంలో బాబు గత సినిమాల రికార్డులనూ గుర్తుచేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా మహేశ్ బాబు భార్య నమత్రా శిరోద్కర్ (Namrata Shirodkar) మహేశ్ బాబు సినిమాలపై స్పందించింది. గతంలో ఆయా సినిమాల విషయంలో ఎప్పటికప్పుడు అభిమానులకు అప్డేట్స్ ఇస్తూ హైజ్ పెంచిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా మాత్రం మహేశ్ బాబు నటించిన చిత్రాల్లో ఆ రెండు సినిమాలు తనకు నచ్చవంటూ చెప్పింది. రీసెంట్ గా తను ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇంతకీ ఆ రెండు సినిమాలు ఏంటంటే...
Namrata Shirodkar
మహేశ్ బాబు కౌ బౌయ్ గా కనిపించిన ‘టక్కరి దొంగ’ సినిమాతోపాటు, ‘బాబీ’ సినిమాలు నమ్రతకు నచ్చవని చెప్పారని ప్రచారం జరుగుతోంది. అయితే ఎందుకు అనేది చెప్పలేదు. తప్పనిసరిగా ఎదురైన ప్రశ్నకు ఇలా బదులిచ్చినట్టు తెలుస్తోంది.