ఆ స్టార్‌ హీరో చిన్నప్పుడే పూజా హెగ్డే హార్ట్ బ్రేక్‌ చేశాడట.. హీరోయిన్‌ అయ్యాక ఏం చేసిందో తెలిస్తే షాకే!

Published : May 04, 2022, 07:44 PM ISTUpdated : May 04, 2022, 09:44 PM IST

బుట్టబొమ్మ పూజా హెగ్డే ఇటీవల బ్యాక్‌ టూ బ్యాక్‌ మూడు సినిమాలతో అలరించింది. తన ఫ్యాన్స్ ని కనువిందు చేసింది. కానీ తన గుండె 12ఏళ్లప్పుడే ముక్కలైందంటూ షాకిచ్చింది.

PREV
17
ఆ స్టార్‌ హీరో చిన్నప్పుడే పూజా హెగ్డే హార్ట్ బ్రేక్‌ చేశాడట.. హీరోయిన్‌ అయ్యాక ఏం చేసిందో తెలిస్తే షాకే!

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ పూజా హెగ్డే(Pooja Hegde) ఇండస్ట్రీలో గోల్డెన్‌ లెగ్‌గా పాపులర్‌ అయ్యింది. ఆమె సినిమాలో ఉందంటే అది హిట్‌ అనే టాక్‌ ఉంది. ఆ మధ్య `బీస్ట్` ఈవెంట్‌లో కూడా నిర్మాత దిల్‌రాజు ఇదే విషయాన్ని చెప్పారు. కానీ ఇటీవల పరిస్థితి రివర్స్ అయ్యింది. పూజా హెగ్డే బ్యాడ్‌ టైమ్‌ స్టార్ట్ అయ్యిందంటున్నారు నెటిజన్లు. 

27

పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన మూడు సినిమాలు వరుసగా పరాజయం చెందాయి. ప్రభాస్‌తో కలిసి నటించిన `రాధేశ్యామ్‌`(Radheshyam) చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై పరాజయం చెందింది. చాలా నష్టాలను చవిచూసింది. ఇందులో ప్రభాస్‌, పూజాల మధ్య కెమిస్ట్రీ పండలేదనే టాక్ వచ్చింది. ఆ తర్వాత విజయ్‌తో కలిసి `బీస్ట్`(Beast) చిత్రంలో నటించింది పూజా. ఈ సినిమా తమిళనాట వంద కోట్ల వరకు వసూలు చేసింది. కానీ ఓవరాల్‌గా ఫ్లాప్‌ జాబితాలో చేరింది. మరోవైపు ఇటీవల రామ్‌చరణ్‌తో చేసిన `ఆచార్య`(Acharya) కూడా డిజాస్టర్‌ టాక్‌ని తెచ్చుకుంది. 

37

ఇలా వరుసగా మూడు సినిమాలు పరాజయం చెందడంతో పూజా కట్టుకున్న కోట మొత్తం కూలినంత పనైందని. దీంతో ఆమెపై రకరకాల కామెంట్లు ఊపందుకున్నాయి. అయితే సినిమా పరాజయంలో హీరోయిన్‌ పాత్ర ఏమీ ఉండదనేది అందరికి తెలిసిన నిజమే. దర్శకుడి టేకింగ్‌, బలమైన కథ ఆధారంగానే సినిమా సక్సెస్‌ ఆధారపడి ఉంటుంది. కొన్ని సార్లు మాత్రమే నటీనటుల  ప్రభావం ఉంటుంది. సినిమాని నటులు తమ నటనతో మరో స్థాయికి తీసుకెళ్తారు. కానీ తక్కువ చేయరు. రేర్‌ కేసులోనే మిస్‌ ఫిట్‌ అనే టాక్‌ వస్తుంది. ఏదేమైనా పూజాపై ఉన్న అభిప్రాయం మారిపోతుందంటున్నారు నెటిజన్లు. 
 

47

అయితే తన హార్ట్ మాత్రం 12ఏళ్లప్పుడే బ్రేక్‌ అయ్యిందంటోంది పూజా హెగ్దే.  ఓ స్టార్‌ హీరో తన హృదయాన్ని ముక్కలు చేశాడని తెలిపింది. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పింది. ఆ స్టార్‌ హీరో బాలీవుడ్‌ గ్రీక్‌ వీరుడు హృతిక్‌ రోషన్‌(Hrithik Roshan) అని వెల్లడించింది. చిన్నప్పటి నుంచి హృతిక్‌ రోషన్‌ అంటే పిచ్చి అట, ఎంతో అభిమానించినట్టు చెప్పింది. ఆయన అందానికి ఫిదా అయ్యిందట. 

57

ఒక్కసారైనా హృతిక్‌ని కావాలని తపించిందట. `కోయీ మిల్‌ గయా` సినిమా టైమ్‌లో ఆయన్ని కలిసేందుకు వెళ్లిందట. ఆ సినిమా ప్రీమియర్‌ టైమ్‌లో హృతిక్‌ని కావాలని వెళ్లిన పూజా ఎలాగైనా  ఆయన్ని కలిసి ఒక ఫోటో దిగాలని తపించిందట. వరుసగా ఆయనతో ఫోటోలు దిగుతున్నారని, తాను కూడా ఫోటోలు దిగాలని స్టేజ్‌ ఎక్కిందట. కానీ అప్పటికే ఆయన మరోవైపు నుంచి స్టేజ్‌ దిగి వెళ్లిపోయారని, దీంతో ఒక్కసారిగా తన హృదయం ముక్కలైందని చెప్పిందీ డస్కీ భామ. అలా స్టార్‌ హీరో తన హృదయాన్ని బ్రేక్‌ చేశాడని చెప్పింది. 

67

ఇందులో గమ్మత్తైన విషయం ఏంటంటే చిన్నప్పుడు తీరని కోరికని హీరోయిన్‌ అయ్యాక తీర్చుకుంది పూజా హెగ్దే. అది మామూలుగా కాదు, ఏకంగా హీరోయిన్‌గా ఆయనతో సినిమా చేసి తన కోరికని తీర్చుకుంది. అందుకోసం ఆమె ఎంతగా కష్టపడి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అభిమానిగా ఫోటో దిగడానికి కుదరలేని పరిస్థితి నుంచి, ఏకంగా ఆయన పక్కనే స్క్రీన్‌ షేర్‌ చేసుకునే స్థాయికి పూజా ఎదిగిన తీరు ఆదర్శనీయం. వీరిద్దరు కలిసి `మొహెంజోదారో` చిత్రంలో నటించారు. అయితే ఈ చిత్రం పరాజయం చెందడం గమనార్హం. 

77

ప్రస్తుతం పూజా హెగ్డే టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. అటు కోలీవుడ్‌, ఇటు బాలీవుడ్‌లోనూ పాగా వేసేందుకు ప్రయత్నిస్తుంది. హిందీలో సల్మాన్‌ ఖాన్‌తో ఓ సినిమా చేస్తుంది. ఇక తెలుగులో మహేష్‌తో త్రివిక్రమ్‌ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. మరోవైపు పవన్‌ కళ్యాణ్‌-హరీష్‌ శంకర్‌ సినిమా చేస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories