ఆపదలో పూజా హెగ్డేని ఆదుకుంటున్న విజయ్‌, `ప్రేమలు` బ్యూటీకి లక్కీ ఛాన్స్, దళపతి69 గ్రాండ్‌ ఓపెనింగ్

Published : Oct 04, 2024, 07:04 PM IST

పూజా హెగ్డే ఒకప్పుడు టాలీవుడ్‌ నెంబర్‌ వన్‌ హీరోయిన్‌గా రాణించింది. ఇప్పుడు ఆమె కెరీర్‌ డౌన్‌ ఫాల్‌ అయ్యింది. ఈ క్రమంలో ఆమెని కాపాడే బాధ్యతలు దళపతి విజయ్‌ తీసుకున్నాడు.   

PREV
17
ఆపదలో పూజా హెగ్డేని ఆదుకుంటున్న విజయ్‌, `ప్రేమలు` బ్యూటీకి లక్కీ ఛాన్స్, దళపతి69 గ్రాండ్‌ ఓపెనింగ్

టాలీవుడ్‌ ఆడియెన్స్ పూజా హెగ్డేని ముద్దుగా బుట్టబొమ్మ అని పిలుచుకుంటారు. రెండేళ్ల వరకు సౌత్‌లో సందడి చేసింది పూజా హెగ్డే. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. ఆమె నుంచి సినిమాలు రాక రెండేళ్లు పైనే అవుతుంది. తెలుగు ఆడియెన్స్ అయితే పూజాని మర్చిపోయే పరిస్థితి వచ్చింది. రెండేళ్ల క్రితం టాప్‌ స్టార్‌గా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు జీరో అయిన పరిస్థితి. ఓ రకంగా పూజా కెరీర్‌ ప్రమాదంలో ఉందనే టాక్‌ వినబడుతుంది. ఈ క్రమంలో ఆపదలో ఉన్న పూజాని ఆదుకునేందుకు వచ్చాడు దళపతి విజయ్‌. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ చూడండి.
 

27

పూజా హెగ్డేకి అదిరిపోయే ఛాన్స్ ఇచ్చారు. మరోసారి తనతో కలిసి నటించే అవకాశం ఇచ్చాడు. `బీస్ట్` తర్వాత మరోసారి ఆమెతో రొమాన్స్ కి రెడీ అవుతున్నాడు. తన కొత్త సినిమాలో బుట్టబొమ్మకి ఛాన్స్ ఇవ్వడం విశేషం. ప్రస్తుతం విజయ్‌.. హెచ్‌ వినోద్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. `దళపతి 69` పేరుతో దీన్ని తెరకెక్కిస్తున్నారు.

ఇందులో హీరోయిన్‌గా ఆఫర్‌ ఇచ్చాడు విజయ్‌. ఈ మూవీ నేడు శుక్రవారం చెన్నైలో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఇందులో హీరోయిన్‌ పూజా హెగ్డే కూడా పాల్గొంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 

37

విజయ్‌ నటిస్తున్న చివరి సినిమాలో మరో యంగ్‌ బ్యూటీకి ఛాన్స్ దక్కింది. ఇటీవల `ప్రేమలు` సినిమాతో సౌత్‌ సెన్సేషనల్‌ అయ్యింది. మమితా బైజు మలయాళంలో రూపొందిన `ప్రేమలు` మూవీ తెలుగులోనూ డబ్‌ అయి పెద్ద విజయం సాధించింది. ఇందులో మమిత బైజు కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. ఈ సినిమా తర్వాత సౌత్‌లో హాట్‌ కేక్‌లా మారింది మమిత బైజు. ఈ క్రమంలో ఆమె దళపతితో కలిసి నటించే అవకాశం రావడం విశేషమనే చెప్పాలి. ఈ దెబ్బతో ఈ అమ్మడి లైఫ్‌ టర్న్ తీసుకుంటుందని చెప్పొచ్చు.
 

47

ఈ సినిమాలో బాబీ డియోల్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఆయనది నెగటివ్‌ రోల్‌ అని తెలుస్తుంది. ఆయనతోపాటు గౌతమ్‌ మీనన్‌, ప్రకాష్‌ రాజ్‌, ప్రియమణి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హెచ్‌ వినోద్‌ రూపొందిస్తున్న ఈ సినిమాని కేవీఎస్‌ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్‌ కే నారాయణ నిర్మిస్తున్నారు. దీనికి అనిరుథ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు.

సత్యన్‌ సూర్యన్‌ సినిమాటోగ్రాఫర్‌గా, ప్రదీప్‌ ఈ రాఘవ్‌ ఎడిటర్‌గా, అనల్‌ అరసు యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. సెల్వర్‌ కుమార్‌ ఆర్ట్ డైరెక్టర్‌గా చేస్తున్నారు. సినిమా ప్రారంభం రోజే రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు మేకర్స్. పాన్‌ ఇండియా స్థాయిలో తమిళంతోపాటు తెలుగు, హిందీలో కూడా 2025 అక్టోబర్‌లో రిలీజ్‌ చేయనున్నట్టు తెలిపారు. విజయ్‌ రాజకీయాల్లోకి వెళ్తున్న నేపథ్యంలో ఆయన నటిస్తున్న చివరి మూవీ ఇదే కావడం విశేషం.  
 

57

ఇక పూజా హెగ్డేకి కూడా ఈ మూవీ చాలా స్పెషల్‌ కాబోతుంది. విజయ్‌ చివరి చిత్రంలో హీరోయిన్‌గా నటించే అవకాశం ఆమెకి రావడం ప్రత్యేకంగా చెప్పొచ్చు. అందుకే ఈ సినిమా అందరికి ప్రత్యేకమనే చెప్పాలి. నేడు పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ రేపటి(శనివారం) నుంచి రెగ్యూలర్‌ షూటింగ్‌ స్టార్ట్ చేసుకోబోతుంది. పెద్దగా సినిమాలు లేక ఆయోమయంలో ఉంటున్న నేపథ్యంలో పూజా హెగ్డేకి ఈ మూవీ పెద్ద బూస్ట్ ఇస్తుందని చెప్పాలి. తను కూడా చాలా హోప్స్ తో ఉంది. మరి విజయ్‌ పూజాకి మరో లైఫ్‌ ఇస్తాడా? లేడా అనేది చూడాలి. 

67

పూజా హెగ్డే దీంతోపాటు సూర్యతోనూ ఓ సినిమా చేయబోతుందట. సూర్య 44లో ఆమె హీరోయిన్‌గా ఎంపికైందని తెలుస్తుంది. దీనికి కార్తిక్‌ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే హిందీలో  `దేవా` అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. మరోవైపు తెలుగులో మాత్రం ఇప్పటి వరకు ఒక్కటి కూడా కన్ఫమ్‌ కాలేదు. అయితే నాగచైతన్యతో ఓ సినిమా చేస్తుందనే వార్తలు వచ్చాయి. `విరూపాక్ష` ఫేమ్‌ కార్తీక్‌ దండు దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాలో పూజా హెగ్డే పేరు వినిపిస్తుంది. 
 

77

దళపతి విజయ్‌ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన అధికారికంగా పార్టీని ప్రకటించారు. `తమిలగ వెట్రీ కజగమ్‌`(టీవీకే) పేరుతో కొత్తగా పార్టీని స్థాపించారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయిన తర్వాత ఆయన పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే దిశగా ఆయన సన్నాహాలు చేస్తున్నారు.

ఈ మేరకు ఇప్పట్నుంచే దానికి సంబంధించిన ప్లానింగ్‌లో ఉన్నారు విజయ్‌. కోలీవుడ్‌లో విజయ్‌కి విశేష పాపులారిటీ ఉంది. తెలుగులో పవన్‌ కళ్యాణ్‌ రేంజ్‌ తమిళంలో విజయ్‌ది. దాన్ని రాజకీయాల్లో సమూల మార్పుకు ఉపయోగించుకోవాలని, రాజకీయాల్లో రాణించేందుకు వాడుకోబోతున్నారు విజయ్‌. మరి ఎంత వరకు సక్సెస్‌ అవుతాడో చూడాలి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories