డైరెక్టర్ కొరటాల గుట్టు రట్టు చేసిన జాన్వీ కపూర్.. దేవర హీరోయిన్ ఇలా అనేసిందేంటి...?

First Published | Oct 4, 2024, 6:40 PM IST

దేవర సినిమాతో సూపర్ హిట్ కొట్టారు కోరటాల టీమ్. అయితే ఈసినిమాలో ఓ టాప్ సీక్రెట్ ను బయటపెట్టి.. కొరటాల గుట్టు రట్టు చేసింది జాన్వీ.. ఇంతకీ విషయం ఏంటంటే..? 

దేవర సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర తక్కువగా ఉన్నప్పటికీ, ఆమె నటన ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా ఆమె నటించిన 'చుట్టమల్లే' పాట సినిమాకి హైలైట్ గా నిలిచింది. అయితే ఈ పాట చిత్రీకరణ సమయంలో దర్శకుడు కొరటాల శివ అందుబాటులో లేరని జాన్వీ కపూర్ వెల్లడించారు.

Also Read: సినిమాలకు రజినీకాంత్ గుడ్ బై..

Ntr, Devara, koratala shiva

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దాదాపు మూడేళ్ల తరువాత అభిమానులను అలరించిన సినిమా దేవర.  కొరటాల శివ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ భారీ పాన్‌ ఇండియాన్ యాక్షన్ ఎంటర్టైనర్.. సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది.

ఇక సోలో హీరోగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆరేళ్ల తర్వాత నటించిన సినిమా కావడంతో నందమూరి  అభిమానుల్లో ఈమూవీపై భారీగా క్రేజ్ పెరిగింది. అటు  జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు.. తెలుగు సినిమా ప్రేక్షకుల్లో కూడా ఈసినిమాపై  భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే సినిమాపై కాస్త నెగెటీవ్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల పరంగా మాత్రం రచ్చ చేస్తోంది దేవర. సినిమా రిలీజ్ అయిన కేవలం మూడు రోజులకే ప్రపంచ వ్యాప్తంగా రు. 304 కోట్ల రాబట్టిన ఈ సినిమా.. ఫైనల్ రన్ లో ఎంత రాబడుతుందా అని అంతా  ఎదురు చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా రు. 185 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీ స్టార్ట్ చేసింది. 

Also Read: నాటు కోడి - చేపల పులుసు మెగాస్టార్ చిరంజీవికి అత్యంత ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా?


 ఎన్టీఆర్ ఆర్ట్స్ – యువ సుధా ఆర్ట్స్‌ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్ , మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మించిన ఈసినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ అందాల భామ.. శ్రీదేవి గారాల కూతురు జాన్వీ కపూర్ నటించింది. అయితే ఈసినిమాలో జాన్వీ పుల్ లెన్త్ లో కనిపించలేదు. ఆమె పాత్ర చాలా తక్కువ డ్యూరేషన్ లో ఉంది. ఒక్క రొమాంటిక్ సాంగ్ మినహాయించి.. జాన్వీ పాత్ర పెద్దగా కనిపించలేదు. దాంతో బాలీవుడ్ లో జాన్వీ ఫ్యాన్స్ కాస్త డిస్సపాయింట్ అయ్యారు. 

Also Read: ఎన్టీఆర్ ఫుడ్ సీక్రెట్ బయటపెట్టిన మహేష్ బాబు

ఇక దేవర పార్ట్ 1 లో సరిగ్గా  కనిపించలేదు కాని.. దేవర సెకండ్ పార్ట్ సినిమాలో ఆమె పాత్ర ఉంటుందేమో అనుకుంటున్నారు.. ఇక ఈసినిమాలో జాన్వీ కపూర్ చుట్టమల్లే సాంగు తో  దుమ్ము రేపింది. కుర్రళ్ల గుండెల్లో గుబులు పుట్టించింది. ఒక్క సాంగ్ తో దేవర సినిమా చూసిన  ప్రేక్షకులందరికీ గుర్తుండిపోయేలా  మెస్మరైజ్ చేసింది జాన్వీ కపూర్.

ఇక ఈక్రమంలో ఈ  పాటకు సబంధించిన ఓ సీక్రెట్ ను రీసెంట్ గా రివిల్ చేసి.. డైరెక్టర్ కొరటాల శివను ఇరికించింది జాన్వీ కపూర్. మరి ఇంతకీ ఈ పాటకు సబంధించిన టాప్ సీక్రేట్ ఏంటంటే..?  దేవర రిలీజ్ కు ముందు .. సినిమా ప్రమోషన్ లో భాగంగా.. బాలీవుడ్ లో  కపిల్ షో కి వెళ్లారు దేవర టీమ్.

అందులో తారక్ తో పాటు  జాన్వీ కపూర్,  సైఫ్‌ ఆలీఖాన్ కూడా పాల్గొన్నారు. అయితే ఈ షోలో సినిమాకు సబంధించిన చాలా  విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంలోనే కపిల్ శర్మ సరదాగా కొన్ని ప్రశ్నలు అడిగారు.. అందులో ఈరొమాంటిక్ సాంగ్ విషయం కూడా వచ్చింది. 

Also Read: అప్పుడు ఆలియా భట్.. ఇప్పుడు జాన్వీ కపూర్... క్యారెక్టర్ ఆర్టిస్ట్ కంటే దారుణంగా హీరోయిన్ల పాత్రలు

NTR , Janhvi Kapoor, Devara,

ఈ పాట చేసేప్పుడు.. ఎన్టీఆర్ తో రొమాన్స్ చేసేప్పుడు.. వైఫ్ ఫీల్ అవుతుందేమో సీన్ మారుద్దామా అని ఏదైనా సందర్భంలో ఆలోచన  వచ్చిందా.. ఆ విషయం డైరెక్టర్ కు చెప్పారా.. అని జాన్వీకపూర్ ను కపిల్ శర్మ అడిగారు. దానికి సమాధానం చెప్పుతూ.. అసలు ఆ సాంగ్ షూట్ చేసేటప్పుడు డైరెక్టర్ అక్కడ లేరు.. అని ఎన్టీఆర్ – జాన్వీ ట్విస్ట్ ఇచ్చారు. 
 

Also Read:  బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి

devara

ఆ పాటను థాయిలాండ్ లో తీశారు.. అప్పుడు ఏదో అర్జెంట్ పని ఉంది.. కొరటాల అక్కడికి రాలేదట. దాంతో మొత్తం సాంగ్ ను కొరియోగ్రాఫర్ షూట్ చేశారని చెప్పారు. దీంతో ప్రేక్షకులు అంత హిట్ పాట డైరెక్ట్ చేసింది కొరటాల శివ కాదా.. డైరెక్టర్ లేకుండా ఇంత పెద్ద సినిమా.. ఇంత హిట్ సాంగ్ ను షూట్ చేశారా అని కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ విషయం అప్పటి నుంచి వైరల్ అవుతూనే ఉంది.

Also Read:సీనియర్ నటుడిపై సీరియస్ అయిన ఎన్టీఆర్,

Latest Videos

click me!