8 నిమిషాల యాడ్ కోసం.. 150 కోట్లు ఖర్చు పెట్టించిన అల్లు అర్జున్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

Published : Oct 22, 2025, 12:30 PM IST

ఒక యాడ్ ఫిల్మ్.. 8 నిమిషాల డ్యూరేషన్.. బడ్టె మహా అయితే ఎంత అవుతుంది, కోటి.. రెండు కోట్లు.. స్టార్స్ ఎవరైనాఉంటే 10 కోట్లు అవుతుందదేమో.. కానీ ఓ డైరెక్టర్ మాత్రం ఆ యాడ్ కోసం 150 కోట్లు బడ్జెటతో తెరకెక్కించాడట. ఇంతకీ ఎవరా దర్శకుడు. 

PREV
14
భారీగా పెరిగిపోతోన్న సినిమాల బడ్జెట్

టాలీవుడ్ లో సినిమా సినిమాకు బడ్జెట్ భారీగా పెరిగిపోతోంది. రోజురోజుకు స్టార్స్ రెమ్యునరేషన్స్ కూడా పెరిగిపోతున్నాయి. ఇక ఇప్పుడు సినిమాలే కాదు.. యాడ్ ఫిల్మ్స్ కు కూడా భారీగా బడ్జెట్ ను కేటాయిస్తున్నారు. గతంలో లక్షల్లో ఉండే యాడ్ ఫిల్మ్స్ బడ్జెట్... ఇప్పుడు కోట్లకు చేరింది. కోట్లు కాస్తా.. వందల కోట్లకు వచ్చేసింది. తాజాగా ఓ డైరెక్టర్ కమర్షియల్ యాడ్ కోసం దాదాపు 150 కోట్ల బడ్జెట్ ను ఖర్చు చేయించాడట. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు, అల్లు అర్జున్ తో పాన్ వరల్డ్ మూవీ చేస్తోన్న అట్లీ. ప్రస్తుతం యాడ్ ఫిల్మ్ మేకింగ్ లో తమిళ దర్శకుడు అట్లీ అగ్రస్థానంలో నిలిచాడు. ఇంతకీ అట్లీ డైరెక్ట్ చేసిన ఆ 150 కోట్ల యాడ్ ఫిల్మ్ ఏది?

24
8 నిమిషాల యాడ్ ఫిల్మ్ కోసం 150 కోట్లు

అట్లీ డైరెక్ట్ చేసిన 150 కోట్ల యాడ్ ఫిల్మ్ షెజ్వాన్ సాస్ కోసం రూపొందించబడింది. అంతే కాదు అన్నియాడ్స్ లాగా సెకండ్ల వ్వవదిలో అయిపోయే యాడ్ కాదు ఇది. ఈ యాడ్ ప్రత్యేకత ఏమిటంటే, 8 నిమిషాల నిడివి ఉన్న యాక్షన్‌ కమర్షియల్ ఇది. ఈ యాడ్‌లో బాలీవుడ్ స్టార్స్ నటించడంతో పాటు.. భారీ యాక్షన్ సన్నివేశాలు, పాటలు కూడా ఉన్నాయి. భారీగా గ్రాఫిక్స్ కూడా వాడారు. అవే ఈ యాడ్ కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

34
100 మంది ఆర్టిస్ట్ లతో

ఈ యాడ్‌లో బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్, తెలుగు హీరోయిన్ శ్రీలీల, బాబీ డియోల్ లాంటి ప్రముఖులు నటించారు. వీరితో పాటు సుమారు 100 మంది జూనియర్ ఆర్టిస్టులు, ఫైటర్స్, ఇతర సాంకేతిక బృందం కలిసి భారీగా షూటింగ్‌ను కూడా నిర్వహించారు. ఆర్మీ నేపథ్యంలో సాగే సన్నివేశాలు ఈ యాడ్ ఫిల్మ్ కు ప్రత్యేక ఆకర్శణగా ఉన్నాయి. రెస్క్యూ చేసే సన్నివేశంతో పాటు పాట కూడా దీనికి యాడ్ చేశారు. దీన్ని యాడ్ లా కాకుండా ఓ మినీ మూవీలా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ యాడ్‌ను బాలీవుడ్‌లో ప్రత్యేకంగా ఓ ప్రీమియర్ ఈవెంట్ ద్వారా విడుదల చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ , గ్రాఫిక్ వర్క్, సెట్స్ చూసి, ఇది యాడ్‌గా కాదు ఓ భారీ సినిమా లాగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

44
అల్లు అర్జున్ తో పాన్ వరల్డ్ మూవీ

అట్లీ తాజాగా రూపొందించిన ఈ షెజ్వాన్ సాస్ యాడ్‌ ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారి తీసింది. మరీ యాడ్ ఫిల్మ్ కోసం ఇంత ఖర్చు చేస్తారా అని అందరు గుసగుసలాడుతకుంటున్నారు. స్టార్ డైరెక్టర్ అట్లీ ప్రస్తుతం అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా రూపొందిస్తున్నాడు అట్లీ.. దీని కోసం ప్రత్యేకంగా ముంబయ్ లో వర్క్ షాప్ కూడా నిర్వహిస్తున్నారు. దాదాపు 800 కోట్ల బడ్డెట్ లో ఈసినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories