పూజా బేబి గుండె బద్దలైన వేళ...ఆ చేదు అనుభవంతో మూడేళ్లు బాలీవుడ్ లో అడుగుపెట్టలేదు

First Published Nov 1, 2020, 3:12 PM IST

నాలుగవ సినిమాతోనే హృతిక్ రోషన్ కి జంటగా నటించే అవకాశం దక్కించుకున్న పూజ హెగ్డే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మొహంజోదారో మూవీతో పూజ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.

ఆ సినిమా విడుదలైనమూడేళ్ళ తరువాత గత ఏడాది అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కినహౌస్ ఫుల్ 4 మూవీ చేయడం జరిగింది. బాలీవుడ్ లో పూజా హెగ్డేకుఇంత గ్యాప్ రావడానికి కారణం తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
undefined
'లోకానికి మనల్నిపరిచయం చేసే మొదటి చిత్రం అంటే అందరికీ ప్రత్యేకమే. నా మొదటి హిందీ చిత్రం మొహంజోదారో చిత్రం కోసం నేను కొన్ని సినిమాలు వదులుకొని దానికోసమే పని చేశాను. ఆ సినిమా పరాజయం కావడంతో నాగుండె పలిగింది'అన్నారు.
undefined
ఆ సినిమా ఫలితం పూజాను షాక్ కి గురి చేయగా స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఇవ్వాలని, మంచి చిత్రంలో నటించాలనిడిసైడ్ అయ్యిందట. హౌస్ ఫుల్ 4 సక్సెస్సంతోషాన్ని కలిగించిందని పూజ హెగ్డే చెప్పుకొచ్చారు.
undefined
రోహిత్ శెట్టి దర్శకత్వంలోరణ్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కనున్న సర్కస్ మూవీలో పూజ హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. జాక్విలిన్ఫెర్నాండెజ్ మరో హీరోయిన్ గా సర్కర్మూవీలో నటిస్తున్నారు.
undefined
ఇక రోహిత్ శెట్టి చిత్రాలు అంటే ఇష్టమన్న పూజ హెగ్డే, ఆయన తెరకెక్కించిన సింబా మూవీ వాళ్ళ నాన్నతో కలిసి చూసిందట. ఆ మూవీలో అజయ్ దేవ్ గణ్ ఎంట్రీ అద్భుతం అని పూజా రోహిత్ శెట్టిని కొనియాడారు.
undefined
తెలుగులో పూజ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు. యంగ్ హీరో అఖిల్ హీరోగాబొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీలో పూజ హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.
undefined
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ లో కూడా పూజ హీరోయిన్ గా నటిస్తున్నారు. పూజ బర్త్ డే కానుకగా విడుదలైన ఆమె ఫస్ట్ లుక్ విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.
undefined
click me!