పూజా హెగ్డేపై ఐరన్‌ లెగ్‌ ముద్ర పడింది అప్పుడేనట.. స్టార్‌ హీరో సినిమాపై బుట్టబొమ్మ సంచలన వ్యాఖ్యలు

Published : Jun 28, 2022, 04:59 PM ISTUpdated : Jun 28, 2022, 05:00 PM IST

బుట్టబొమ్మ పూజా హెగ్డే స్టార్‌ హీరో సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తన కెరీర్‌లోనే అదొక చెత్త సినిమా అంటూ మండిపడింది. తాజాగా ఆమె వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.   

PREV
18
పూజా హెగ్డేపై ఐరన్‌ లెగ్‌ ముద్ర పడింది అప్పుడేనట.. స్టార్‌ హీరో సినిమాపై బుట్టబొమ్మ సంచలన వ్యాఖ్యలు

హాట్‌ బ్యూటీ పూజా హెగ్డే ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆమెని మించిన స్టార్‌ హీరోయిన్‌ లేదని చెప్పొచ్చు. భారీ పారితోషికం, భారీ సినిమాలు ఆమె సొంతం. సూపర్‌ స్టార్లకి కేరాఫ్‌ పూజా. సౌత్‌లో గోల్డెన్‌ లెగ్‌ హీరోయిన్‌ గా ముద్ర వేసుకున్న బుట్ట బొమ్మ కెరీర్‌లో పరాజయాలు కూడా ఉన్నాయి. 

28

పూజా హెగ్డే `ముకుందా`, `ఒకలైలా కోసం` చిత్రాలతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈసినిమాలు ఫర్వాలేదనిపించాయి. ఆ తర్వాత ఆమె బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చి హృతిక్‌ రోషన్‌తో `మొహెంజోదారో` చిత్రంలో నటించింది. ఈ సినిమా పరాజయాన్ని చవిచూసింది. దీంతో దాదాపు రెండేళ్లపాటు తెరపై కనిపించలేదు పూజా. 

38

ఆ తర్వాత తెలుగులో `డీజే` చిత్రంలో మెరిసింది. ఈ సినిమాతో విజయాన్ని అందుకుంది. వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. `అరవింద సమేత`, `అల వైకుంఠపురములో`, `మహర్షి` చిత్రాలతో వరుస విజయాలను అందుకుంది. టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా ఎదిగింది. అత్యధిక పారితోషికం అందుకుంటున్న కథానాయికగా రాణిస్తుంది. 
 

48

ఇటీవల ప్రభాస్‌తో చేసిన `రాధేశ్యామ్‌`, విజయ్‌ తో చేసిన `బీస్ట్`, రామ్‌చరణ్‌తో నటించిన `ఆచార్య` చిత్రాలు పరాజయం చెందాయి. దీంతో ఆమెని గోల్డెన్‌ లెగ్‌ నుంచి కాస్త, ఐరన్‌ లెగ్‌ అని పిలవడం స్టార్ట్ చేశారు. కానీ అది ఎక్కువ రోజులు నిలవలేదు. ఆమె క్రేజ్‌ తగ్గలేదు. సినిమాలు తగ్గలేదు సరికదా, మరిన్ని పెరిగాయి. ఇప్పుడు వరుసగా స్టార్‌ హీరోల సినిమాలు చేస్తుంది పూజా. 

58

తెలుగులో మహేష్‌తో త్రివిక్రమ్‌ సినిమాలో నటిస్తుంది. మరోవైపు పవన్‌ కళ్యాణ్‌తో `భవదీయుడు భగత్‌ సింగ్‌` చిత్రంలో నటించాల్సి ఉంది. దీంతోపాటు విజయ్‌ దేవరకొండతో `జనగణమన` సినిమా చేస్తుంది. హిందీలో సల్మాన్‌ ఖాన్‌తో `కభీ ఈద్‌ కభీ దివాళీ` చిత్రంలో నటిస్తుంది. ఇలా వరుస ఆఫర్లతో ఫుల్‌ బిజీగా ఉంది. 

68

అయితే తాజాగా ఓ బాలీవుడ్‌ మీడియాతో మాట్లాడుతూ, ఓ స్టార్‌ హీరో సినిమాపై బుట్టబొమ్మ షాకింగ్‌ కామెంట్లు చేసింది. అదో చెత్త సినిమాగా అంటూ వ్యాఖ్యానించింది. పూజా హిందీలో హృతిక్‌ రోషన్‌తో `మొహెంజోదారో` సినిమా చేసిన నేపథ్యంలో అది పరాజయం చెందింది. తన కెరీర్‌లోనే అదొక చెత్త సినిమాగా మిగిలిపోయిందని పేర్కొంది పూజా. తన సినిమా లిస్ట్ లో లీస్ట్ లో ఉంటుందని చెప్పింది. 

78

‘తెలుగులో నేను నటించిన ఆరు సినిమాలు వరుసగా హిట్‌ అవ్వడం నా కెరీర్‌ అది బెగ్గెస్ట్‌ సక్సెస్‌. ఇక లోయేస్ట్‌ పాయింట్‌ వచ్చేసి నా బాలీవుడ్ డెబ్యూ `మొహంజోదారో` చిత్రమే బాక్సాఫీసు వద్ద పరాజయం పొందడం. నా కెరీర్‌లో అది ఒక చెత్త సినిమాగా నిలిచింది. నా లీస్ట్‌ చిత్రాల్లో అది ఒక్కటే. ఆ సినిమా వల్ల నాకు ఏడాది పాటు ఆఫర్స్‌ రాలేదు. ఈ సినిమా ఫ్లాప్‌తో నాకు ఐరన్‌ లెగ్‌ అనే పేరు కూడా వచ్చింది` అని చెప్పింది.
 

88

ఇంకా పూజా మాట్లాడుతూ, `తెలుగు చిత్రం `అలా వైకుంఠపురంలో` నాకు బ్రేక్‌ ఇచ్చింది. ఇక అప్పటి నుంచి నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ సినిమా నా కెరీర్‌ను అద్భుతంగా మార్చింది` అంటూ చెప్పుకొచ్చింది. పూజా అడపాదడపా ఐటెమ్‌ సాంగ్‌లు కూడా చేస్తుంది. ఆ మధ్య `రంగస్థలం`లో జిగేల్‌ రాణి అంటూ ఇండస్ట్రీని ఊపేసింది. ఇటీవల `ఎఫ్‌ 3`లో స్పెషల్‌ సాంగ్ చేసింది. కానీ దానికి అంతగా రెస్పాన్స్ రాలేదు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories