Prema Entha Madhuram: రాగసుధకు ఎదురుపడిన పోలీసులు.. గన్నుతో చంపడానికి ప్లాన్!

Navya G   | Asianet News
Published : Feb 03, 2022, 08:38 AM IST

Prema Entha Madhuram: బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం (Prema Entha Madhuram) సీరియల్  ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి ప్రేమ కథ నేపథ్యంలో  ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. రఘుపతి ని నమ్ముకోకుండా ఈసారి ఆ ప్లాన్ నేనే చేయాలి అనుకుంటుంది మాన్సీ . ఇంతలో రఘుపతి (Raghupathi) ఆఫీసులోకి రానే వస్తాడు.

PREV
14
Prema Entha Madhuram: రాగసుధకు ఎదురుపడిన పోలీసులు.. గన్నుతో చంపడానికి ప్లాన్!

ఆ తర్వాత మాన్సీ రఘుపతి (Raghu pathi) మాటలకు చిరాకుపడి తన చెప్పు తోనే తాను కొట్టుకొని అక్కడినుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు రాగసుధ సుబ్బు వాళ్ళ ఇంట్లో ఉంటూ తనకు జరిగిన చేదు అనుభవాలను గురించి ఆలోచించుకుంటూ ఉంటుంది. ఈలోపు సుబ్బు, పద్మ లు వచ్చి డోర్ కొడతారు. దాంతో రాగసుధ (Raga sudha) వేరే ఎవరైనా వచ్చారేమో అని భయపడుతుంది.
 

24

ఆ తర్వాత సుబ్బు, పద్దు (Padhu) లు ఇంటికి వచ్చి రాగసుధ ను తమ వ్యాపారంలో సహాయం చేయడానికి ఉంటావా అని అడుగుతారు. దానికి ఏమాత్రం ఆలోచించకుండా రాగసుధ సరే అని అంటుంది. దానికి వారి ఇరువురి దంపతులు ఆనందం వ్యక్తం చేస్తారు. మరోవైపు అను.. రాగసుధ (Raga sudha) గురించి బాగా ఆలోచిస్తూ ఉంటుంది.
 

34

నీ గురించి తెలుసుకోవడం ఎలా రాగసుధ.. అని అనుకుంటూ అను భాద పడుతుంది. మరో వైపు రాగసుధ సుబ్బు (Subbu) వాళ్ల హోటల్ లో పనిచేస్తూ ఉంటుంది. ఈలోపు అక్కడకు పోలీసులు వస్తారు. దాంతో రాగసుధ బాగా భయపడుతుంది. ఆ పోలీస్ లు వచ్చి నేరుగా రాగ సుధ నే పిలుస్తారు. ఒక ఫోటో చూపించి ఆ వ్యక్తి ఆచూకీ  అడుగుతారు. ఇక రాగసుధ (Ragasudha) నాకు ఎవరూ తెలియదు అని చెబుతుంది.
 

44

ఆ తర్వాత పోలీస్, సుబ్బు (Subbu) వాళ్ళ హోటల్ లోనే టిఫిన్ చేయడానికి వస్తాడు. ఇక పోలీస్ రాగసుధ ను జీప్ లో ఉన్న ఫోన్ తీసుకుని రమ్మన్నాడు. అలా తీసుకురావడానికి వెళ్లిన రాగసుధ. ఆ జీప్ లో ఉన్న గన్ ను చూసి దానిని వెంటనే తీసుకొని ఆర్య ను చంపాలని ఆలోచిస్తుంది. మరి ఈ క్రమంలో రాగసుధ (Ragasudha) రేపటి భాగంలో ఏం చేస్తుందో చూడాలి.

click me!

Recommended Stories