Prema Entha Maduram: రివాల్వర్ ఇవ్వడానికి వెళ్ళిన రాగసుధ, సుబ్బు.. ఊహించని షాకిచ్చిన పోలీస్!

Navya G   | Asianet News
Published : Feb 25, 2022, 09:18 AM IST

Prema Entha Maduram: బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రేమ ఎంత మధురం (Prema Entha Maduram) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. సుబ్బు రివాల్వర్ ను పోలీసులకు ఇచ్చేసి వద్దాం అని రాగ సుధ (Ragasudha) ను తీసుకుని వెళతాడు.  

PREV
15
Prema Entha Maduram: రివాల్వర్ ఇవ్వడానికి వెళ్ళిన రాగసుధ, సుబ్బు.. ఊహించని షాకిచ్చిన పోలీస్!

 ఆ తర్వాత అను (Anu)  ఈరోజు కూడా రాగసుధను కలుసుకొని నా కథ గురించి తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత ఆర్య ఎక్కడున్నాడని వెతుకుతూ ఉంటుంది. కానీ ఆర్య ఒక చోట సోఫాలో కూర్చుని దిగాలుగా ఉంటాడు. ఇక ఆర్య (Arya)  ప్రామిస్ డే సందర్భంగా  నానుంచి ఏదైనా ప్రామిస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా అని  అను ని అడుగుతాడు.
 

25

 ఆ తర్వాత అను (Anu) నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమైన మిమ్మల్ని ప్రామిస్ చేయమని అడగడం చాలా తప్పు సార్ అని చెబుతుంది. దాంతో ఆర్య  నాపై ఇంత నమ్మకం పెట్టుకున్నందుకు చాలా థ్యాంక్స్ అని చెబుతాడు. కానీ ఈ రోజు నిన్ను ఒకటి అడగాలి అనుకుంటున్నాను అని ఆర్య (Arya) అంటాడు.
 

35

దాంతో అను (Anu) , ఆర్య ఏం అడుగుతాడో టెన్షన్ పడుతుంది.  ఇక ఆర్య నువ్వు ప్రామిస్ చేస్తేనే నేను అడుగుతాను అని పట్టు పడతాడు. దాంతో అను ప్రామిస్ చేస్తోంది. ఇక ఆర్య (Arya)  నా గురించి నీకేం తెలిసిన, సిచువేషన్ ఎలాంటిదైనా నువ్వు నన్ను నమ్మవు కదూ.. అలానే నా చివరి క్షణం వరకు ఉంటాను అని మాటివ్వు అని చెబుతాడు.
 

45

 దాంతో అను (Anu)  ఒక భార్యగా మిమ్మల్ని గెలిపించడానికి ఎప్పుడు మీతో నే ఉంటాను సార్  అని మాట ఇస్తుంది. నేను పోయే చివరి క్షణంలో కూడా నీ భార్య గా మీ పక్కనే ఉంటాను అని ఒట్టేసి చెబుతుంది. ఇక సుబ్బు (Subbu)  వాళ్ళు పోలీస్ స్టేషన్ కు వెళ్లి రివాల్వర్ దొరికిన విషయం చెబుతాడు.
 

55

 ఆ తర్వాత ఆ సి ఐ (Ci) రివాల్వర్ తో ఎవరి ని చంపడానికి ప్లాన్ చేశావు అని రాగసుధ  ను అడగగా షాక్ అవుతుంది. రాగసుధ ముసుకు వేసుకొని ఉండడంతో ఆ సిఐ ముసుకు తియ్యమని అడుగుతాడు. దాంతో రాగ సుధ (Ragasudha) ముసుకు తెస్తుంది. ఇక ఆ ముఖం చూసి మిస్సింగ్ కేసు గురించి గ్రహించుకుని రాగ సుధను గుర్తు పడతాడు.

click me!

Recommended Stories