Chiranjeevi: చిరంజీవి సినిమా, ముందుగానే భయపడిన పోలీసులు.. ఆడియోతోనే సౌత్ లో తిరుగులేని రికార్డ్

Published : Apr 04, 2026, 07:40 AM IST

చిరంజీవి నటించిన ఓ సినిమా రిలీజ్ కి ముందు నుంచే పోలీసులకు టెన్షన్ మొదలైంది. థియేట్రికల్ రిలీజ్ తో పాటు ఆడియో సేల్స్ లో కూడా ఆ చిత్రం సౌత్ లో తిరుగులేని రికార్డ్ గా నిలిచింది. 

PREV
15
Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి సినిమా రిలీజ్ అంటే అభిమానుల హంగామా తారా స్థాయిలో ఉంటుంది. చిరంజీవి సినిమా మంచి అంచనాలతో విడుదలైతే ఓపెనింగ్స్ అదిరిపోతాయి. అలా చిరంజీవి కెరీర్ లో అత్యంత భారీ అంచనాలతో విడుదలైన సినిమాల జాబితాలో ఇంద్ర చిత్రం ముందు వరుసలో ఉంటుంది. ఇంద్ర మూవీ విషయంలో ప్రతి ఒక్కటీ అభిమానులని ఆకట్టుకున్నాయి.

25
చిరంజీవి, బి గోపాల్ కాంబో..

రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో చిరంజీవి సినిమా చేయడం చాలా అరుదు. అప్పటికి ఫ్యాక్షన్ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. ఆ తరుణంలో చిరంజీవి, బి గోపాల్ కాంబోలో తెరకెక్కిన ఇంద్ర సృష్టించిన రికార్డులు అన్నీ అన్నీ ఇన్నీ కావు. చిరంజీవి ఈ చిత్రంలో రెండు షేడ్స్ ఉండే పాత్రల్లో కనిపించారు. ఫస్ట్ హాఫ్ లో శంకర్ నారాయణగా, సెకండ్ హాఫ్ లో ఇంద్రసేనారెడ్డి గా అదరగొట్టారు.

35
8 లక్షలకు పైగా అమ్మకాలు

ఈ చిత్రానికి ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే గ్లామర్ కలసివచ్చింది. రిలీజ్ కి ముందు నుంచే ఇంద్ర చిత్రం అంచనాలు పెంచేసింది. సినిమా రిలీజ్ కి 45 రోజుల ముందే ఆడియో రిలీజ్ చేశారు. అప్పటి నుంచే ఇంద్ర సంచలనాలు మొదలయ్యాయి. అతి తక్కువ టైంలో అత్యధిక ఆడియో క్యాసెట్, సీడీ అమ్మకాలు జరిగిన చిత్రంగా ఇంద్ర సౌత్ లోనే రికార్డ్ సృష్టించింది. చాలా తక్కువ టైంలో 8 లక్షలకు పైగా అమ్మకాలు జరిగాయి.

45
పోలీస్ డిపార్ట్మెంట్ అలెర్ట్

ఈ చిత్రం కోసం అభిమానులు అప్పట్లో ఎంతగా ఎదురుచూశారో చెప్పడానికి ఇదే నిదర్శనం. ఈ మూవీ రిలీజ్ టైంలో ముందు నుంచే పోలీస్ డిపార్ట్మెంట్ అలెర్ట్ అయిందట. ఈ చిత్రం ప్రభంజనం సృష్టించడం ఖాయం అని భావించిన పోలీసులు ఆడియన్స్ ని కంట్రోల్ చేయడానికి చాలా తిప్పలు పడ్డారు.

55
చిరంజీవికి రిక్వస్ట్

మార్నింగ్ షో పడగానే విజయవాడ పోలీస్ కమిషనర్ చిరంజీవికి స్వయంగా ఫోన్ చేశారట. ఈ సినిమా మామూలుగా ఉండబోవడం లేదు. మీ అభిమానులని కంట్రోల్ చేయడం కష్టం అవుతోంది. థియేటర్ల వద్ద మీ అభిమానులని ప్రశాంతంగా ఉండమని, క్రమశిక్షణ పాటించమని మీరే చెప్పండి. వాళ్ళు మీరు చెబితేనే వింటారు. లేకుంటే అన్ని ఏరియాల్లో వాళ్ళని కంట్రోల్ చేయడం మా పోలీసులకు ఇబ్బంది అవుతుంది అని రిక్వస్ట్ చేసినట్లు నిర్మాత అశ్విని దత్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories