ఆశిష్ విద్యార్థి హిందీ నటుడు. అక్కడ అనేక సినిమాలు చేశాడు. విలన్‌గా పాపులర్ అయ్యాడు. తెలుగులో `పాపే నా ప్రాణం` చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. `శ్రీరామ్`, `మాధురి`, `గిల్లీ`, `గుడుంబాశంకర్`, `ఛత్రపతి`, `అతనొక్కడే`, `నరసింహుడు` వంటి సినిమాలు చేశాడు. ఈ క్రమంలో `పోకిరి` పెద్ద బ్రేక్ ఇచ్చింది. విలన్‌గా మెప్పించాడు. ఆ తర్వాత మరింత బిజీ అయ్యాడు.