ప్లీజ్‌ ఎవరితోనైనా డేటింగ్‌ చేయండి.. అభిమాని రిక్వెస్ట్ కి సమంత హార్ట్ టచ్చింగ్‌ ఆన్సర్‌.. వైరల్‌

First Published Mar 27, 2023, 10:33 AM IST

స్టార్‌ హీరోయిన్‌ సమంత ఓ వైపు విడాకుల ఘటన నుంచి బయటపడి, మరోవైపు అనారోగ్యంతో పోరాడి గెలిచింది. ఇన్‌స్పైర్‌ లేడీగా నిలిచింది. ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది. 
 

సమంత గత రెండేళ్లుగా అత్యంత సంఘర్షణతో కూడిన సమయాన్ని గడిపింది. ఇంట్లో వివాహ జీవితంలో ఏర్పడిన విభేదాలతో ఆమె ఎంతో బాధపడింది. చివరికి భర్త నాగచైతన్యతో విడిపోయింది. ఈ విడిపోయే క్రమంలో ఆమె ఫేస్‌ చేసిన మానసిక సంఘర్షణ అంతా ఇంతా కాదు. డిప్రెషన్‌ స్థాయికి వెళ్లి కోలుకుంది. దైర్యంగా నిలబడింది. కొత్త జీవితాన్ని ప్రారంభించింది. వరుసగా సినిమా అవకాశాలను దక్కించుకుని పనిలో బిజీ అయ్యింది. ఆ చేదు జ్ఞాపకాలను మర్చిపోయేందుకు శతవిధాలా ప్రయత్నించి ఆల్మోస్ట్ విజయం సాధించిందనే చెప్పాలి. 

Samantha

అంతా సెట్ అవుతుందనుకునే సమయంలోనే అనారోగ్యం ఆమెని మరింత కుంగదీసింది. మయోసైటిల్‌ జబ్బు ఆమెని దారుణంగా వెంటాడింది. మరణం అంచుల వరకు వెళ్లే పరిస్థితి వచ్చిందనే వార్తలు వచ్చాయంటే ఎంతగా సమంత ఇబ్బంది పడిందో తెలిసిందే. ఆమె కూడా తన పరిస్థితి గురించి చెబుతూ ఓ ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకుంది. అది అభిమానులనే కాదు, సాధారణ ప్రజలను సైతం కదిలించింది. అయ్యో అనిపించింది. ఎట్టకేలకు మయోసైటిస్‌ వ్యాధిపై పోరాటం చేసి గెలిచింది సమంత. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని రకాలుగా సెట్‌ అయ్యిందనే చెప్పొచ్చు. దీంతో వరుసగా సినిమా షూటింగ్స్ లో బిజీగా గడుపుతుంది. 
 

కానీ ఈ రెండు సంఘటనలతో సమంత మరింత మందికి దగ్గరయ్యింది. కామన్‌ ఆడియెన్స్ కి సైతం చేరువైంది. వారి హృదయాలను గెలుచుకుంది. ఈ క్రమంలో ఆమెని చాలా మంది అమ్మాయిలు స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. ఆమెపై ప్రేమని చాటుకుంటున్నారు. తాజాగా ఓ లేడీ అభిమాని పెట్టిన పోస్ట్ వైరల్‌ అవుతుంది. ఇందులో ఆమె ఎవరితోనైనా డేటింగ్‌ చేయండి అని చెప్పడం విశేషం. దీనికి సమంత రియాక్షన్‌ కి మాత్రం ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇంతకి అభిమాని ఏం చెప్పింది, సమంత రియాక్షన్‌ ఏంటనేది చూస్తే. 

`ఇది నా స్థలం కాదని తెలుసు, కానీ ప్లీజ్‌ ఎవరితోనైనా డేటింగ్‌ చేయండి` అని పేర్కొంది.  ఇందులో `శాకుంతలం` ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడిన ఇంటర్వ్యూ క్లిప్‌ని జోడించింది. ఈ వీడియో సమంతకి ట్యాగ్‌ చేస్తూ ఆమె పోస్ట్ చేయగా, దీనిపై సామ్‌ స్పందించింది. `మీ లాగా నన్ను ఎవరు ప్రేమిస్తారు` అని హార్ట్ ఎమోజీని పంచుకుంది. దీంతో ఆ అభిమాని ఫిదా అయిపోయిందని చెప్పొచ్చు. సమంత రియాక్షన్‌ ఆమెనేకాదు అందరిని ఆకట్టుకుంటుంది. అయితే కాసేపటికే ఆ ట్వీట్‌ని ఆ సదరు అభిమాని డిలీట్‌ చేయడం గమనార్హం.

కానీ సమంత రియాక్షన్‌పై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. మేమున్నామంటూ ముందుకొస్తున్నారు. మేం ప్రేమిస్తామని చెబుతున్నారు. మాతో డేట్‌కి రండి అంటున్నారు. నేను డేటింగ్‌కి రెడీ అంటూ పోస్ట్ లు పెడుతుండటం విశేషం. దీంతో ఇప్పుడిది నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంది. సమంత ప్రస్తుతం `శాకుంతలం`తో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. గతేడాది `యశోద`తో అలరించిన ఆమె ఇప్పుడు మైథలాజికల్‌ మూవీ `శాకుంతలం` చిత్రంతో ఆడియెన్స్ ని అలరించబోతుంది. ఈ సినిమా వచ్చే నెల 14న విడుదల కానుంది. దీంతోపాటు హిందీలో `సిటాడెల్‌` అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తుంది సామ్‌. అలాగే ఓ ఇంటర్నేషనల్‌ ప్రాజెక్ట్, హిందీ ప్రాజెక్ట్ లు కూడా ఉన్నాయి. 
 

click me!