కిల్లర్‌ లుక్‌లో మత్తు చల్లుతున్న శ్రీలీలా.. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో కైపెక్కించే పోజులు..

Published : Mar 27, 2023, 09:24 AM ISTUpdated : Mar 27, 2023, 09:28 AM IST

యంగ్‌ సెన్సేషన్‌ శ్రీలీలా గురించే ఇప్పుడు ఎక్కడ చూసిన చర్చ జరుగుతుంది. ఆమె అవకాశాలను అందుకుంటున్న తీరు, దూసుకెళ్తున్న విధానం చూసి ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు ఈ బ్యూటీ దెబ్బకి స్టార్‌ హీరోయిన్లు బేజారెత్తిపోతున్నారు. 

PREV
16
కిల్లర్‌ లుక్‌లో మత్తు చల్లుతున్న శ్రీలీలా.. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో కైపెక్కించే పోజులు..

శ్రీలీలా కుర్ర అందాలతో మత్తెక్కిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటోలను పంచుకుంది. బ్లాక్‌ లైన్స్ కలిగిన వైట్‌ బ్లెజర్‌ ధరించి హోయలు పోయింది. చురకత్తుల్లాంటి లుక్స్ లో కత్తిలాంటి పోజులిచ్చింది. అంతేకాదు విరహంతో కూడిన పోజులతో మత్తుజళ్లుతుంది. 
 

26

ప్రస్తుతం శ్రీలీలా బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లని కనువిందు చేస్తున్నాయి. ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారు. కొందరు కొంటె కామెంట్లు పెడుతున్నారు. ఆమె అందాన్ని ఆకాశానికి ఎత్తుతున్నారు. చూపుతిప్పుకోలేకపోతున్నామంటున్నారు. కిల్లర్ లేడీ అని, కిల్లింగ్‌ లుక్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

36

ఇందులో ఓ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్ పెట్టింది శ్రీలీలా. `నీ భాయలను ఎదురుకో ఎందుకంటే భయం అనేది ప్రతి చర్య, ధైర్యం అనేది నిర్ణయం` అని ఇన్‌స్పైరింగ్‌ వర్డ్స్ పంచుకుంది. దీనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇంత చిన్న వయసులో ఇంతటి పెద్ద పోస్ట్ పెట్టడం పట్ల ఆశ్చర్యంతో కూడిన అభినందనలు తెలియజేస్తున్నారు. 
 

46

శ్రీలీలా ఇప్పటి వరకు నటించింది రెండు సినిమాలే. అందులో మొదటి సినిమా పెద్దగా ఆడలేదు. రెండో సినిమా రవితేజతో కలిసి నటించిన `ధమాకా`. ఇది పెద్ద హిట్‌ అయ్యింది. ఇందులో ఆమె డాన్సులు, నటనతో ఆదరగొట్టింది. అంతే ఇప్పుడు వరుస ఆఫర్లు ఆమె కోసం క్యూ కడుతున్నాయి. యంగ్‌ స్టర్స్ నుంచి స్టార్‌ హీరోల వరకు ఆమెనే కావాలనుకుంటున్నారు. 

56

ప్రస్తుతం ఓ ఎనిమిది సినిమాల్లో నటిస్తుంది శ్రీలీలా. అందులో పవన్‌, మహేష్‌, బాలయ్య వంటి పెద్ద హీరోల సినిమాలు కూడా ఉండటం విశేషం. వీటితోపాటు నితిన్‌తో, నవీన్‌ పొలిశెట్టి, వైష్ణవ్‌ తేజ్‌ వంటి వారితో సినిమాలు చేస్తుంది. ఓ రకంగా ఇప్పుడు టాలీవుడ్ ని ఊపేసే పరిస్థితికి చేరుకుంది. పెద్ద హీరోయిన్లకి ఝలక్‌ ఇస్తుంది. 
 

66

మొన్నటి వరకు పూజా హెగ్డే, రష్మిక, కృతి శెట్టి వంటి జోరుసాగింది. కానీ ఇప్పుడు వారందరూ పక్కకెళ్లి ఆడుకునే పరిస్థితి కల్పించింది శ్రీలీలా. ఆమెకి వస్తున్న ఆఫర్లు చూస్తుంటే అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే దీనికంతటికి కారణం ఆమె వెనకాల రాఘవేంద్రరావు ఉన్నారనే టాక్‌ వినిపిస్తుంది. తెరవెనుక ఆయన చక్రం తిప్పుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఇప్పుడు శ్రీలీలా హాట్‌ టాపిక్‌, అండ్‌ హాట్‌ కేక్‌లా మారిందనేది నిజం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories