Guppedantha Manasu: షాకింగ్ డెసిషన్ తీసుకున్న మహేంద్ర దంపతులు.. కోపంతో రగిలిపోతున్న ఫణీంద్ర?

Published : Jul 01, 2023, 07:20 AM IST

Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటూ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. కొడుకు ఆలోచనలని ముందుకు తీసుకువెళ్లాలని తపన పడుతున్న ఓ తల్లి దండ్రుల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూలై 1 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
19
Guppedantha Manasu: షాకింగ్ డెసిషన్ తీసుకున్న మహేంద్ర దంపతులు.. కోపంతో రగిలిపోతున్న ఫణీంద్ర?

ఎపిసోడ్ ప్రారంభంలో జగతిని హత్తుకొని పశ్చాతాపంతో  ఆమెకి క్షమాపణ చెప్పాడు మహేంద్ర. నువ్వు రిషి మంచి కోసమే ఇదంతా చేశాను అని ఎన్నిసార్లు చెప్పినా నేను వినిపించుకోలేదు నా కొడుకు మీద ఉన్న ప్రేమ నీ మీద నమ్మకాన్ని చంపేసింది. నేనే ఎంత బాధ పడుతున్నాను అంటే వాడి మీద నింద మోపినప్పుడు నువ్వు ఎంత బాధపడి ఉంటావో.
 

29

రిషి ఇది అర్థం చేసుకోకుండా జీవితంలో నిన్ను అమ్మ అని పిలవడేమో అని బాధపడతాడు మహేంద్ర. లేదు మహేంద్ర నన్ను అమ్మ అని పిలిచాడు అంటూ ఆరోజు సంఘటన చెప్తుంది జగతి. వరం ఇచ్చినట్లు ఇచ్చి శిక్ష విధించి వెళ్ళిపోయాడు. కానీ నా బాధ అది కాదు నా వల్లే వసుధార తప్పుడు సాక్ష్యం చెప్పింది. వాళ్ళిద్దరూ అనవసరంగా విడిపోయారు  ఎలాగైనా కలపాలి.
 

39

వసు ఎక్కడ ఉందో తెలుసా అంటుంది జగతి. అప్పుడు రిషి వసు తల్లి సంగతి చనిపోయిన సంగతి చెప్పి వసు ఎక్కడ ఉన్నది చెప్తాడు. సుమిత్ర గారు చనిపోయిన సంగతి నాకు తెలుసు నీకు చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేక ఊరుకున్నాను అంటుంది జగతి. మనమే వాళ్ళిద్దరిని కలపాలి ఎలాగైనా రిషి ని తీసుకురావాలి అంటుంది. తప్పకుండా అలాగే చేద్దాం కానీ అప్పటి వరకు ఇక్కడ ఉండొద్దు.
 

49

నాకు వీళ్ళ మొహాలు చూస్తేనే అసహ్యం వేస్తుంది. వెళ్లి గెస్ట్ హౌస్ లో ఉందాం పదా అంటాడు మహేంద్ర. సరే అంటుంది జగతి. మరోవైపు ఏంజెల్, విశ్వం బయటికి వెళ్తూ వసుకి జాగ్రత్తలు చెప్తుంది ఏంజెల్ అవసరమైతే రిషి హెల్ప్ తీసుకోమంటుంది. అలాగే రిషి దగ్గరికి వెళ్లి వసుకి అవసరమైతే హెల్ప్ చెయ్యు అని చెప్పి అతని దగ్గర మాట తీసుకుంటుంది. అవసరమైతే కచ్చితంగా హెల్ప్ చేస్తాను అని మాట ఇస్తాడు రిషి.
 

59

మరోవైపు లగేజ్ తో బయటికి వెళ్తున్న మహేంద్ర దంపతులను ఎక్కడికి వెళ్తున్నారు? ఎప్పుడు వస్తారు అని అడుగుతుంది దేవయాని. మిషన్ ఎడ్యుకేషన్  ను ముందుకు తీసుకు వెళ్లాలంటే మేము ఆ పని మీదే ఉండాలి కాలేజీ గెస్ట్ హౌస్ లో ఉంటాము అక్కడ మాకు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు అని చెప్తాడు మహేంద్ర. మళ్లీ ఎప్పుడు వస్తారు అంటాడు శైలేంద్ర. ఇక తిరిగి రాము అంటాడు మహేంద్ర. అందుకు ఆశ్చర్యపోతారు తల్లి కొడుకులు.
 

69

మీ అన్నయ్య కోర్టుకు వెళ్లారు వచ్చిన తర్వాత ఆయనకు చెప్పి వెళ్ళండి అంటుంది దేవయాని. నేను అన్నయ్యకి ఫోన్ చేస్తాను అని చెప్పి ధరణికి జాగ్రత్త చెప్పి వెళ్ళిపోతాడు మహేంద్ర. బాబాయ్ కి నిజం తెలిసిపోయిందా అని తల్లిని అడుగుతాడు శైలేంద్ర. అలాంటిదేమీ లేదు తెలిస్తే ఈపాటికి ఇల్లంతా రచ్చ చేసేసేవాడు అంటుంది దేవయాని. మరోవైపు భర్త వల్లే మహేంద్ర వాళ్ళు వెళ్లిపోయారని అత్త ని భర్తని అసహ్యించుకుంటుంది ధరణి.
 

79

ఇంతలో మహేంద్ర కోర్టులో కేసు గెలిచినందుకు ఆనందంగా ఇంటికి వస్తాడు. మహేంద్ర కి చెప్పాలనుకుని అతనిని పిలుస్తాడు. అప్పుడు ధరణి జరిగిందంతా ఫణింద్రకీ చెప్తుంది. ఆవేశంతో రగిలిపోతాడు ఫణీంద్ర. ఇదంతా నీకు తెలిసే జరిగిందా అసలు ఇంట్లో ఏం జరుగుతుంది అప్పుడు ధరణి వెళ్ళిపోయింది తర్వాత రిషి వెళ్ళిపోయాడు ఇప్పుడు వీళ్ళిద్దరూ వెళ్ళిపోయారు.
 

89

జరిగిందాంట్లో నీ ప్రమేయం ఉందా అంటూ దేవయాని మీద కేకలు వేస్తాడు. నేను వెళ్ళొద్దని చెప్పానండి కనీసం మీరు వచ్చిన తర్వాత మీకు చెప్పి వెళ్ళమని చెప్పాను మహేంద్ర మీకు ఫోన్ చేస్తానని చెప్పాడు అంటుంది దేవయాని. నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను కారణం మిషన్ ఎడ్యుకేషన్ అయితే ఏం పర్వాలేదు కానీ ఇందులో మీ ప్రమేయం ఉందని తెలిస్తే మాత్రం ఊరుకునేది లేదు. అప్పుడు నా కోపాన్ని మీరు తట్టుకోలేరు అని చెప్పి మహేంద్ర వాళ్ళని తీసుకురావడానికి వెళ్తాడు ఫణీంద్ర. 

99

అప్పుడు దేవయాని ఈయన అక్కడికి వెళ్లి మహేంద్ర తో గొడవ పెట్టుకుంటారు అప్పుడు ఇద్దరికీ గొడవలు జరిగి విడిపోతారు అని కొడుకుకి చెప్తుంది. ఒకవేళ గొడవ జరగకుండా పిన్ని ఆపితే? అని తన అనుమానం వ్యక్తం చేస్తాడు శైలేంద్ర. అలా అయినా పర్వాలేదు అప్పుడు వాళ్ళు మన ఇంటికి వస్తారు వాళ్ళు చేసే ప్రతి పనికి మనం అడ్డు పుల్ల  వేయొచ్చు ఏం జరిగినా మన మంచికే అంటుంది దేవయాని. తరువాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

click me!

Recommended Stories