ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి ప్రీమియర్ రివ్యూ.. నాగ శౌర్యకు ఈసారైన కలిసి వచ్చిందా...?

Published : Mar 17, 2023, 09:15 AM ISTUpdated : Mar 17, 2023, 09:21 AM IST

ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి  సినిమాతో ఈరోజు థియేటర్లను పలకరించబోతున్నాడు నాగశౌర్య. ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్స్ పడిపోయాయి. ఇక సినిమా ఎలా ఉంది..? చాలా కాలంగా హిట్ కోసం చూస్తున్న నాగశౌర్యకు ఈసారి అయినా హిట్ పలుకరించిందా..? ప్రీమియర్స్ రిపోర్ట్ ఏంటీ..?   

PREV
17
ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి ప్రీమియర్ రివ్యూ.. నాగ శౌర్యకు ఈసారైన కలిసి వచ్చిందా...?

హీరో నాగశౌర్య హిట్ కొట్టి చాలా కాలం అయ్యింది. ఎన్ని ప్రయోగాలు చేసినా.. శౌర్యకు పెద్దగా వర్కౌట్ అవ్వడంలేదు. ఇక ఈసారి తనకు లైఫ్ ఇచ్చిన శ్రీనివాస్ అవసరాల డైరెక్షన్ లో ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి  సినిమాతో ముందుకు వచ్చాడు. మరి ఈసారైనా మనోడికి లక్ కలిసి వస్తుంది. సినిమా మెప్పిస్తుందా..? 

27
Phalana Abbayi Phalana Ammayi

నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా శ్రీనివాస్ అవసరాల డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఫలానా అబ్బాయి ఫలానాఅమ్మాయి. శ్రీనివాస్ అవసరాల, మేఘా చౌందరి, అశోక్ కుమార్, అభిషేక్ మహర్షి లాంటి నటులు కీలకపాత్రలు చేసిన ఈసినిమా ఈరోజు(17 మార్చి) థియేటర్లలో సందడి చేయబోతోంది. 

37

ఇద్దరి ప్రేమికుల మధ్య జరిగే సంఘర్షణనే ఈసినిమా. దాన్ని వాస్తవానికి దగ్గర చూపించాడు దర్శకుడు శ్రీనివాస్ అవసరాల. సినిమాను చాలా రియలిస్టిక్ గా తెరకెక్కించాడు  అవసరాల. ఇక్కడే సినిమా చాలా వరకు సక్సెస్ అయినట్లే.  ఎంటర్టైన్మెంట్ ,ఎమోషన్స్ తో పాటు ఈసారి కాస్త రొమాన్స్ డొస్ కూడా పెంచాడు.  అంతే కాదు కల్యాణ్ మాలిక్ అందించిన  మ్యూజిక్ కూడా సినిమాకు కాస్త ప్లస్ అయ్యింది.
 

47

 ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి ఫస్ట్ హాఫ్ చూసుకుంటే.. అడపాదడపా బోరింగ్ సీన్స్ తప్పలేదు. అది మినహాయించి, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి లీడ్ పెయిర్‌తో, ముఖ్యంగా హీరోయిన్‌తో కనెక్ట్ అయ్యే సీన్స్ అద్భుతంగా పండాయి. ఫస్ట్ హాఫ్ తో తెలిసిపోతుంది. ఈసినిమా మొత్తం రెండు పాత్రల మధ్య జరిగే సందర్భాలు మరియు సంభాషణలపై నడుస్తుంది అని. హీరో హీరోయిన్ మధ్య సన్నివేశాలలో మైమరిచిపోయేలా చేశాడు దర్శకుడు. ఈలోపు ఇంట్రవెల్ ట్విస్ట్ తో.. సెకండ్ హాఫ్ పై ఇంట్రెస్ట్ ను పెంచాడు
 

57

కాకపోతే సెకండ్ హాఫ్ లో  ఆడియన్స్ అనుకున్నంతగా అందుకోలేకపోయాడు దర్శకుడు.. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సెకండ్ హాఫ్ కొంత వరకూ బాగుంటుంది. కొన్ని సన్నివేశాలు చూసేవారికి బాగా కనెక్ట్ అవుతుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే.. పీక్స్ లో ఉండాల్సిన సన్నివేశాలు.. అనుకున్న ఎమోషనల్ హైప్ ని అందుకోలేకపోయింది అన్న అభిప్రాయం వెల్లడవుతుంది. శ్రీనివాస్ అవసరాల ‌- నాగశౌర్య కాంబినేషన్ అంటే కాస్త ఎక్స్ పెక్టేషన్స్ తో వచ్చినవారికి. ఆ రేంజ్ లో కా కపోయినా.. మధ్యస్తంగా ఎంటర్టైన్మెంట్ ను అందించింది సినిమా. 
 

67

ఇక సినిమాకు హైలైట్ ఏంటీ అంటే..  హీరో హీరోయిన్. లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. నాగశౌర్య, మాళవిక నాయర్ జంట చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఇక ఇద్దరి మధ్య హద్దులు చెరిపేస్తూ.. సందర్భం ప్రకారం వచ్చే ఘాటు సన్నివేశాలు.. కాస్త ఇబ్బంది పెడతాయి. అందులోను.. ఎప్పుడూ.. మంచి బాలుడు అనిపించుకున్న  నాగశౌర్య.. ఈసారి  రొమాంటిక్ డోస్ గట్టిగానే పెంచాడు. 

77

ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమాకు మరో ప్లస్ పాయింట్ ఏంటంటే నాగశౌర్య- శ్రీనివాస్ అవసరాల. ఈ హీరో, డైరెక్టర్ ది  బ్లాక్ బాస్టర్ కాంబినేషన్. దాంతో అంచనాలు పెరగడంతో పాటు.. వీరి కాంబోలో సినిమా నిరాశపరచదు అనే ఆలోచనలో ఉంటారు ఆడియన్స్. ఈ ఇద్దరు హ్యాట్రిక్ హిట్ కోసం గట్టిగా కష్టపనడ్డారు. సినిమా చూస్తే ఆ విషయం అర్ధం అవుతుంది. వీరి కాంబినేషన్ లో వచ్చిన ఊహలు గుసగుసలాడే , జ్యో అచ్యుతానంద సినిమాలు సూపర్ సక్సెస్ అవ్వగా..  ఇప్పుడు ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి తో నాగశౌర్య ,అవసరాల శ్రీనివాస్ హ్యాట్రిక్ కొట్టారా లేదా అనేది ఈరెండు రోజుల్లో తేలిపోతుంది. 

click me!

Recommended Stories