ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది శృతీ హాసన్. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. ఏజ్ పెరిగినా ఛాన్స్ లు మాత్రం బాగానే కొట్టేస్తుంది. ముఖ్యంగా సీనియర్ హీరోలకు ఓన్లీ ఆప్షన్ గా మారిపోయింది శృతి హాసన్. రీసెంట్ గా చిరంజీవి, బాలకృష్ణ సరసన వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాల్లో నటించి మెప్పించింది బ్యూటీ. అంతే కాదు బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్స్ అందుకుంది.