చెవుల నుంచి రక్తం కారుతున్నా డ్యాన్స్ ఆపని ఐశ్వర్య.. డెడికేషన్‌ అంటే అది!

First Published Aug 21, 2020, 11:58 AM IST

సినీ ఇండస్ట్రీలో టాప్‌ పోజిషన్‌కు రావటం అంటే మామూలు విషయం కాదు. ఎంతో శ్రమ, పట్టుదల కావాలి. అలాంటి పట్టుదల చూపించిన వారే టాప్ చైర్‌ను అందుకున్నారు. తాజాగా హీరోయిన్‌ ఐశ్వర్య రాయ్‌ అలా తన డెడికేషన్ చూపించి సంఘటనను అభిమానులు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.

బాలీవుడ్ బెస్ట్‌ మూవీస్‌లో ఒకటిగా పేరు తెచ్చుకున్న సినిమా దేవదాస్‌. ఈ సినిమా ఏకంగా ఐదు జాతీయ అవార్డులతో పాటు 11 ఫిలిం ఫేర్‌ అవార్డులను సాధించి రికార్డ్‌ సృష్టించింది. గతంలో దిల్‌వాలే దుల్హనియా లేజాయింగే సినిమా రికార్డ్‌ను ఈ మూవీ బద్దలు కొట్టింది.
undefined
2010లో ఎంపైర్‌ మ్యాగజైన్‌ ప్రకటించిన ప్రపంచంలోనే100 అత్యుత్తమ చిత్రాల జాబితాలోనూ దేవదాస్‌ స్థానం సంపాదించుకుంది. అంతేకాదు 2002లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన సినిమాల్లో ఇదే అత్యుత్తమ సినిమాగా పేరు తెచ్చుకుంది.
undefined
సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో మాస్టర్‌ పీస్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో షారూక్‌ ఖాన్, ఐశ్వర్య రాయ్‌, మాధురీ దీక్షిత్‌, జాకీ ష్రాఫ్‌లు కీలక పాత్రల్లో నటించారు. భారీ సెట్స్‌, కాస్ట్యూమ్స్, అద్భుతమైన కొరియోగ్రాఫీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
undefined
ఈ సినిమాలో దేవదాసు చిన్ననాటి స్నేహితురాలు పారు పాత్రలో నటించింది ఐష్. సినిమాలో మాధురీ దీక్షిత్‌తో కలిసి డోలారే డోలారే అనే పాటలో ఆడిపాడింది. సూపర్‌ హిట్ అయిన ఈ పాట షూటింగ్ సందర్భంగా ఐశ్వర్య చెవులకు గాయమై రక్తస్రావమైంది. అయితే ఆ విషయం షూటింగ్ జరుగుతున్నంత సేపు ఐష్‌ ఎవరికీ చెప్పలేదు.
undefined
ఈ పాటలో అద్భుతమైన గ్రేస్‌తో డ్యాన్స్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది ఐశ్వర్య. షూటింగ్ పూర్తయిన తరువాత ఆమె చెవికి అయిన గాయం చూసి యూనిట్ సభ్యులు ఆందోళన చెందారు. అంతేకాదు ఈ పాట షూటింగ్ జరుగుతున్న సమయంలో మాధురీ దీక్షిత్ గర్భవతి.
undefined
సినిమాలో మరో ప్రధాన అంశం మాధురీ దీక్షిత్ పై తెరకెక్కించిన పాట. ఈ పాటలో ఆమె ధరించిన డ్రెస్‌ణు 15 లక్షలు పెట్టి డిజైన్‌ చేశారు. ఆ డ్రెస్‌ బరువు ఏకంగా 30 కేజీలు. అబు జైన్‌, సందీప్‌ ఖోస్లాలు ఈ డ్రెస్‌ను డిజైన్‌ చేశారు.
undefined
2002లో రూపొందిన ఈ సినిమాను దాదాపు 50 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. అందులో 20 కోట్లతో ఏకంగా 6 సెట్స్‌ను వేశారు. ఈ సినిమా కోసం 700 మంది లైట్‌ మెన్‌, 42 భారీ జెనరేటర్‌లను వినియోగించినట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి.
undefined
మాధురీ చేసిన చంద్రముఖి పాత్ర ఉండే కోోఠను 12 కోట్లతో సెట్ వేశారు. ఇక ఐశ్వర్య పోషించిన పార్వతి పాత్ర రూమ్‌ను లక్ష్యా 22 వేల గ్లాస్‌ పీసెస్‌తో రూపొందించారు. అందుకు దాదాపు 3 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది.
undefined
click me!