అనసూయ యాంకర్ గా ఎంత గుర్తింపు తెచ్చుకుందో నటిగా కూడా బాగా పాపులారిటీ పొందింది. బుల్లితెరపై గ్లామర్ ఒలకబోసిన అనసూయ వెండితెరపై మాత్రం వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటోంది. క్షణం, రంగస్థలం, పుష్ప చిత్రాల్లో అనసూయ ఎలా నటించిందో చూశాం. అనసూయ తరచుగా వివాదాల్లో కూడా చిక్కుకుంటూ ఉంటుంది. ఆంటీ అనే పదంపై కొంతకాలం.. విజయ్ దేవరకొండతో కొంతకాలం, కోట శ్రీనివాసరావు తో కొంతకాలం ఇలా వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి.