లిఫ్ట్ లో రొమాంటిక్ పోజిచ్చిన నాగ చైతన్య-శోభిత, ఎంగేజ్మెంట్ అనంతరం మొదటిసారి కెమెరా కంటికి చిక్కిన జంట 

First Published | Oct 20, 2024, 12:42 PM IST

నాగ చైతన్య-శోభిత ధూళిపాళ్ల త్వరలో వివాహం చేసుకోనున్నారు. ఇటీవల వారికి ఎంగేజ్మెంట్ అయ్యింది. ఎంగేజ్మెంట్ అనంతరం మొదటిసారి కెమెరా కంటికి చిక్కారు. 
 

Naga Chaitanya

నాగ చైతన్య త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆగస్టు 8వ తేదీన శోభిత ధూళిపాళ్ల తో నాగ చైతన్య నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో నాగ చైతన్య - శోభిత ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యారు. వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అక్కినేనివారి కొత్త కోడలిపై అనేక చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలో మరో కొత్త టాపిక్ తెరపైకి వచ్చింది.

Naga Chaitanya

గతంలో నాగ చైతన్య - శోభిత ధూళిపాళ్ల  రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. వీరిద్దరూ చాలా సార్లు ఫారెన్ లో జంటగా కనిపించారు.తరచుగా వెకేషన్స్ కి వెళ్లేవారనే వాదన ఉంది. ఈ క్రమంలో డేటింగ్ రూమర్స్ ఎక్కువయ్యాయి. వాటిని నిజం చేస్తూ నాగ చైతన్య  శోభిత ధూళిపాళ్ల తో ఎంగేజ్మెంట్ చేసుకుని ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున అఫీషియల్ గా ప్రకటించారు. 

నాగార్జున ఎంగేజ్మెంట్  ట్విట్టర్ ఎక్స్ లో ఫోటోలు షేర్ చేశాడు.పెళ్ళికి కాస్త సమయం ఉందని తెలిపారు. కాగా ఎంగేజ్మెంట్ అనంతరం మొదటిసారి నాగ చైతన్య, శోభిత కెమెరా కంటికి చిక్కారు. వారు లిఫ్ట్ లో ఉన్న ఫోటో వైరల్ అవుతుంది. 
 


Naga Chaitanya


బ్లాక్ డ్రెస్ లో గాగుల్స్ ధరించి ఉన్న ఈ జంట చాలా స్టైలిష్ గా ఉన్నారు.  ఎంగేజ్మెంట్ అనంతరం శోభిత ధూళిపాళ్ల సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఫేస్ చేసింది. ఈ క్రమంలో శోభిత సోషల్ మీడియాను పెద్దగా వాడటం లేదు. అలాగే శోభిత, నాగ చైతన్య ఫోటోలు బయటకు రావడం లేదు. చాలా రోజుల తర్వాత శోభిత, నాగ చైతన్యల ప్రైవేట్ ఫోటో బయటకు వచ్చింది. 

ఈ నేపథ్యంలో శోభితను నాగార్జున భార్య అమల తో పోలుస్తున్నారు. అమల కి ఉన్నంత బాధ్యత శోభితకి ఉంటుందా? అక్కినేని కుటుంబంలోకి రాబోతున్న శోభిత ఫ్యామిలీ కోసం అమల మాదిరి కెరీర్ త్యాగం చేస్తుందా? అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. 
 

Naga Chaitanya-Sobhita Dhulipala

1992లో అక్కినేని నాగార్జున హీరోయిన్ అమలను రెండో వివాహం చేసుకున్నాడు. చాలా సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. అయితే పెళ్ళైన తరువాత అమల సినిమాల్లో నటించలేదు. కుటుంబం కోసం కెరీర్ ని పక్కన పెట్టింది.పెళ్ళైన ఏళ్ల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. సెలెక్టివ్ గా తల్లి పాత్రలు, గెస్ట్ రోల్స్ చేస్తుంది. నాగ చైతన్య శోభితను రెండో వివాహం చేసుకోబోతున్నారు. ఆమె కూడా నటనకు గుడ్ బై చెబుతుందా? అనే సందేహాలు మొదలయ్యాయి. 


నాగ చైతన్య మాజీ భార్య సమంతకు అక్కినేని ఫ్యామిలీ కెరీర్ విషయంలో ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చింది. నాగ చైతన్య కూడా  ఆమెను ప్రోత్సహించాడు. సమంత వివాహం అనంతరం కూడా బోల్డ్ రోల్స్ చేసింది. నాగ చైతన్యతో విభేదాలకు అది కూడా కారణం అంటారు. ఒకవేళ శోభిత నటన కొనసాగిస్తే నాగ చైతన్య-శోభిత బంధం ఒడిదుడుకులు లేకుండా సాగుతుందా? అనే అనుమానాలు మొదలయ్యాయి . ప్రస్తుతం నాగ చైతన్య చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ మూవీ చేస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. 
 

Latest Videos

click me!