మైత్రీలో 'పీపుల్స్ మీడియా' భారీ పెట్టుబడి? దిల్ రాజుతో ఫైటా

First Published May 30, 2024, 6:56 PM IST

ఇక నుంచి పీపుల్స్ మీడియా  చిత్రాలన్నీ నైజాం ప్రాంతంలో మైత్రి ద్వారా విడుదల చేయబడతాయి. 

Dil Raju


ఈ మధ్యకాలంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) నిర్మాణ సంస్థ పేరు తెలుగు పరిశ్రమలో బాగా వినిపిస్తున్న సంగతితెలిసిందే.   తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ పేరు ఓ బ్రాండ్ గా మారింది. ఈ నేపథ్యంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న సినిమాలపై భారీగా క్రేజ్ ఉంది. ప్రస్తుతం దాదాపు స్టార్ హీరోల అందరి సినిమాలు లైన్ లో పెట్టేసింది ఈ బ్యానర్. 

ఇటీవల రవితేజతో ధమాకా, పవన్ కళ్యాణ్ తో బ్రో లాంటి భారీ సినిమాలు రూపొందించిన ఈ బ్యానర్ ఇప్పుడు ప్రభాస్ తో రాజాసాబ్ (Rajasaab) స్పిరిట్‌ (Spirit) సినిమాలను లైన్ లో పెట్టింది.  ఈ క్రమంలో ఈ బ్యానర్ కు భారీ డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ కూడా అవసరమే. అందుకోసం మైత్రీ మూవీతో టై అప్ అయ్యినట్లు వార్తలు వినిపిస్తోంది.

Latest Videos


ఇన్నాళ్లుగా దిల్ రాజు నైజాంలో డిస్ట్రిబ్యూటర్‌గా ఆధిపత్యం చెలాయించారు. ఆయనతో విభేదాలు వచ్చిన తరువాత, మైత్రి వారు సొంత డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్‌ఎల్‌పి పేరుతో మెదలెట్టారు.   ఆదిపురుష్, సాలార్, హనుమాన్ వంటి చిన్నా, పెద్ద చిత్రాల థియేట్రికల్ హక్కులను కూడా ఫ్యాన్సీ ధరలకు కొనుగోలు చేసి రిలీజ్ చేసారు. ఈ క్రమంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్‌ఎల్‌పి కూడా ఎగ్జిబిషన్ పరిశ్రమలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడుతోంది.  వారు చాలా స్క్రీన్‌లను లీజుకు తీసుకున్నారు. 

బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్, డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ లో విమర్శలు అందుకున్న దిల్ రాజు నైజాం రీజియన్ లో కాస్త స్లో అయ్యాడు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్‌ఎల్‌పి ఇప్పుడు టాప్ గేర్‌లో ఉంది మరియు రాబోయే నెలల్లో వారు అనేక ఇంట్రస్టింగ్,  క్రేజీ ప్రాజెక్ట్‌లను విడుదల చేస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్‌ఎల్‌పి చాలా మంది నిర్మాతలకు మొదటి ఎంపికగా కనిపిస్తోంది. 


దిల్ రాజుతో సన్నిహితంగా అనుబంధం ఉన్న UV క్రియేషన్స్ వారి రాబోయే చిత్రం భజే వాయు వేగం మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLPకి ఆఫర్ చేసింది. అలాగే దిల్ రాజుతో విభేధాలు వచ్చిన పీపుల్స్ మీడియా సంస్ద సైతం మైత్రీ వారితోనే ముందుకు వెళ్లటానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం.  


ఇక నుంచి పీపుల్స్ మీడియా  చిత్రాలన్నీ నైజాం ప్రాంతంలో మైత్రి ద్వారా విడుదల చేయబడతాయి. తన సినిమాలే కాకుండా మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాలకు కూడా భాగస్వామిగా ఉండటానికి పీపుల్స్ మీడియా నిర్ణయించుకుంది. 

నైజాం ప్రాంతంలోని  అగ్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ దిల్ రాజు తో విభేదాలు రావడంతో విశ్వ ప్రసాద్ ఈ డెసిషన్ తీసుకున్నాడని అంటున్నారు. శర్వానంద్ రాబోయే చిత్రం మనమే జూన్ 7న మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా విడుదల కానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ద్వారా భారీ సంఖ్యలో సినిమాలు నిర్మిస్తోంది. అవి రాబోయే రోజుల్లో మైత్రి ద్వారా విడుదల కానున్నాయి. ప్రభాస్ రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు మరియు ఈ చిత్రం 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

click me!