శ్రీలీల గ్లామర్, పెర్ఫామెన్స్ తో తొలి చిత్రంలోనే యువత ఫిదా కావడంతో ప్రస్తుతం టాలీవుడ్ లో ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. ఒకవైపు శ్రీలీల సినిమాలో హీరోయిన్ గా రాణిస్తూనే తన విద్యాభ్యాసం కూడా పూర్తి చేస్తోంది. హీరోయిన్ గా ఛాన్సులు వచ్చాక తమ చదువులని చాలా మంది హీరోయిన్లు మధ్యలోనే వదిలేసిన వాళ్ళు ఉన్నారు. కానీ శ్రీలీల మాత్రం అలా కాదు. శ్రీలీల ఎంబిబిఎస్ చదువుతున్న సంగతి తెలిసిందే.