షాకింగ్.. చైతు హీరోయిన్ పై అసభ్యంగా బాడీ షేమింగ్ కామెంట్స్, గుర్తు పట్టలేనంతగా

Published : May 01, 2022, 06:33 AM IST

అక్కినేని నాగచైతన్య నటించిన సాహసం శ్వాసగా సాగిపో చిత్రం గుర్తుందిగా. ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది మలయాళీ బ్యూటీ మంజిమ మోహన్. 

PREV
16
షాకింగ్.. చైతు హీరోయిన్ పై అసభ్యంగా బాడీ షేమింగ్ కామెంట్స్, గుర్తు పట్టలేనంతగా

అక్కినేని నాగచైతన్య నటించిన సాహసం శ్వాసగా సాగిపో చిత్రం గుర్తుందిగా. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది మలయాళీ బ్యూటీ మంజిమ మోహన్. 

 

26

అప్పట్లోనే కొంచెం బొద్దుగా ఉన్నప్పటికీ ఆమె క్యూట్ లుక్స్ యువతను కట్టి పడేశాయి. కానీ సాహసం శ్వాసగా సాగిపో మూవీ నిరాశపరచడంతో టాలీవుడ్ లో మంజిమకు ఆఫర్స్ రాలేదు. 

36

ఆ మధ్యన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో మాత్రం ఓ రోల్ లో నటించింది. నారా భువనేశ్వరి పాత్రలో మంజిమ ఎన్టీఆర్ బయోపిక్ లో నటించింది. తమిళంలో మాత్రం మంజిమ కొన్ని ఆఫర్స్ అందుకుంటోంది. 

 

46

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంజిమ లేటెస్ట్ గా తన బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేసింది. ఈ ఫోటోస్ లో ఆమె ఫిజిక్ లో ఊహించని మార్పు కనిపిస్తోంది. మంజిమ బాగా బొద్దుగా మారింది. సాహసం శ్వాసగా సాగిపో చిత్రంలో ఆమె లుక్ కి.. లేటెస్ట్ లుక్ కి చాలా తేడా కనిపిస్తోంది

 

56

సాధారణంగానే కాస్త బొద్దుగా కనిపించే మంజిమ.. ఈ పిక్స్ లో ఇంకాస్త బొద్దుగా కనిపిస్తోంది. కానీ చాలా అందంగా ఉంది. కానీ మంజిమపై నెటిజన్లు బాడీ షేమింగ్ కి దిగారు. కొందరు అసభ్యంగా కామెంట్స్ చేస్తున్నారు.  దీనితో తనపై బాడీ షేమింగ్ చేసే వీరిని మంజిమ రిక్వస్ట్ చేస్తోంది. 

66

దయచేసి నాపై బాడీ షేమింగ్ చేయవద్దు. కొందరు సహజంగానే లావు పెరుగుతుంటారు. మీరు కామెంట్స్ చేసినంత మాత్రాన ఎవరూ సన్నగా నాజూగ్గా మారిపోరు కదా అని మంజిమ పేర్కొంది. బాడీ షేమింగ్ చేయడం వల్ల ఆత్మ విశ్వాసం దెబ్బ తింటుంది. కొందరి శరీర లక్షణాలని బట్టి వారు లావుగా ఉండడం, సన్నగా ఉండడం జరుగుతుంది అని మంజిమ పేర్కొంది. 

Read more Photos on
click me!

Recommended Stories