Peddi Movie: పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్, ఎందుకంత సీక్రెట్ గా దాచేస్తున్నారు ?

Published : Jun 01, 2026, 08:53 AM IST

రాంచరణ్ నటించిన పెద్ది మూవీ మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అంతా సిద్ధమైంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి చిత్ర యూనిట్ కొన్ని విషయాలు సీక్రెట్ దాచేస్తున్నారు. 

PREV
15
రాంచరణ్ పెద్ది మూవీ

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన పెద్ది మూవీ చిత్రం మరో మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ అవుతోంది. జూన్ 4న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. జూన్ 3న రాత్రి ప్రీమియర్స్ తో షోలు ప్రారంభం అవుతాయి. పెద్ది చిత్రానికి సంబందించిన బిగ్గెస్ట్ ప్రమోషనల్ ఈవెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని విజయవాడలో ప్లాన్ చేశారు. జూన్ 1న నేడు సాయంత్రం 5 గంటల నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభం కానుంది.

25
విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్

ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో అభిమానుల్లో చాలా ఆసక్తి నెలకొంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ లు ఎవరు వస్తారు అనేది ఇంకా రివీల్ చేయలేదు. ఈవెంట్ కి హాజరయ్యే అతిథుల విషయంలో చిత్ర యూనిట్ సీక్రెట్ మైంటైన్ చేస్తోంది. ఎందుకు ఇంతలా దాచేస్తున్నారు అనే అనుమానాలు అభిమానుల్లో నెలకొన్నాయి.

35
ఎందుకంత సీక్రెట్

అయితే కొన్ని రూమర్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్ కి హాజరవుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మెగా బ్రదర్స్ ఇద్దరూ ఈవెంట్ కి హాజరైతే అభిమానుల్లో జోష్ వేరే లెవల్ లో ఉంటుంది అని చెప్పడంలో సందేహం లేదు.

45
వెన్యూ ఇదే

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మరో ట్రైలర్ రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఏ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించడం లేదు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ ఈవెంట్ ని నిర్వహించనున్నారు.

55
నటీనటులు

పెద్ది చిత్రంలో రాంచరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించగా శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు, బొమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం ఉండబోతుంది.

Read more Photos on
click me!

Recommended Stories