Published : Jan 24, 2026, 09:28 AM ISTUpdated : Jan 24, 2026, 09:55 AM IST
రామ్ చరణ్ నటిస్తోన్న `పెద్ది` సినిమా వాయిదా పడబోతుందట. బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసం రామ్ చరణ్ వెనక్కి తగ్గాలని చూస్తున్నారట. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రామ్ చరణ్ ప్రస్తుతం `పెద్ది` సినిమాలో నటిస్తున్నారు. ఆయన చివరగా నటించిన `గేమ్ ఛేంజర్` బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలవడంతో ఇప్పుడు `పెద్ది` సినిమా విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. ఔట్‌పుట్ విషయంలో చాలా నమ్మకంతో ఉన్నారట. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
26
మార్చి 27న పెద్ది రిలీజ్
`పెద్ది` సినిమా నుంచి విడుదలైన `చికిరి` సాంగ్ ఎంతగా ఆదరణ పొందిందో తెలిసిందే. అత్యధికంగా వ్యూస్ సాధించిన పాటగా నిలిచింది. ఇదే సినిమాని జనాల్లోకి బాగా తీసుకెళ్లింది. ఇప్పుడు సినిమా కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. సమ్మర్ స్పెషల్‌గా ఈ మూవీని మార్చి 27న విడుదల చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి వరకు స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోతాయి. కుర్రాళ్లు థియేటర్లకి క్యూ కడుతుంటారు. ఆ సమయంలో సినిమా వస్తే మంచి ఆదరణ దక్కుతుందని టీమ్ భావించి ఈ డేట్‌ని ఫిక్స్ చేసింది.
36
పెద్ది సినిమా వాయిదా?
ఇదిలా ఉంటే ఇప్పుడీ మూవీ వాయిదా పడుతుందట. `పెద్ది` మూవీ మార్చి 27న కాకుండా వెనక్కి వెళ్తుందట. మేలోగానీ, జూన్‌లోగానీ విడుదలయ్యే అవకాశం ఉందట. మరి ఉన్నట్టుండి ఈ వాయిదా ఏంటనేది ఆశ్చర్యంగా మారింది. దానికి కారణం పవన్ కళ్యాణ్ అని సమాచారం. ఆయన హీరోగా నటించిన `ఉస్తాద్ భగత్ సింగ్` మూవీని మార్చిలో విడుదల చేయాలనుకుంటున్నారట. `పెద్ది` డేట్ కే దాన్ని థియేటర్లోకి తీసుకురావాలనుకుంటున్నారట. దీంతో బాబాయ్ కోసం రామ్ చరణ్ వెనక్కి తగ్గే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
అయితే `పెద్ది` సినిమా నిర్మాతలు, `ఉస్తాద్ భగత్ సింగ్` నిర్మాతలు ఒక్కరే. మైత్రీ మూవీ మేకర్స్ వీటిని నిర్మిస్తున్నారు. హీరో, దర్శకుల అభిప్రాయం మేరకు నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం. బాబాయ్ వస్తానంటే అబ్బాయి కాదంటాడా? అందుకే `ఉస్తాద్` కోసం చరణ్ `పెద్ది` వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం.
56
పెద్ది వాయిదాకి అసలు కారణం ఇదేనా?
ఇదిలా ఉంటే `పెద్ది` వాయిదాకి మరో కారణం ఉందట. ఈ మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదట. కొంత షూటింగ్ పెండింగ్ ఉందట. దీంతోపాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరగాల్సి ఉంది. అలాగే పాన్ ఇండియా మూవీ కావడంతో హిందీ రిలీజ్ కి సంబంధించిన థియేటర్ నిబంధనలు ఉంటాయి. ప్రమోషన్స్ ఉంటాయి. దీంతో అనుకున్న డేట్ కి ఇవన్నీ పూర్తి చేయడం కష్టమని భావించి టీమ్ వెనక్కి తగ్గే అవకాశం ఉందని, దీంతో ఆ తేదీన `ఉస్తాద్ భగత్ సింగ్`ని దించాలని అనుకుంటున్నారట. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
66
ఓజీతో పవన్ కళ్యాణ్ బౌన్స్ బ్యాక్
ఇక `ఉస్తాద్ భగత్ సింగ్` చిత్రంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించగా, హరీష్ శంకర్ దర్శకుడు. `గబ్బర్ సింగ్` తర్వాత ఈ కాంబో కలిసి పనిచేస్తోంది. ఇందులో శ్రీలీలా హీరోయిన్. ఇటీవల విడుదల చేసిన `దేఖ్ లేంగే సాలా` పాట ఆద్యంతం యువతని ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ చివరగా `ఓజీ` చిత్రంతో అలరించారు. ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. సుమారు మూడు వందల కోట్ల కలెక్షన్ల వరకు వెళ్లిందని సమాచారం. ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహించారు. ముంబాయి గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో యాక్షన్ డ్రామాగా రూపొందింది. పవన్ అభిమానులను తెగ ఆకట్టుకుంది. ఈ మూవీ సక్సెస్ తో పవన్ బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఆయనకు మార్కెట్ విస్తరించింది. ఇది `ఉస్తాద్`కి హెల్ప్ కాబోతుందని చెప్పొచ్చు. కాగా ప్రస్తుతం పవన్ ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం అనే విషయం తెలిసిందే.