కమల్ హాసన్ ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలుసా? ఇల్లు, వ్యాపారాలు, లండన్ లోనూ ప్రాపర్టీస్..

First Published | Nov 7, 2023, 11:57 AM IST

లోకనాయకుడు కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెతున్నాయి. రాబోయే చిత్రాల నుంచీ అప్డేట్స్  అందుతున్నాయి. ఈ క్రమంలో ఆయన ఆస్తుల విలువ, వ్యాపారాల వివరాలు ఆసక్తికరంగా మారాయి.
 

చిత్రపరిశ్రమలో చెరగని ముద్రవేశారు కమల్ హాసన్ (Kamal Haasan).  నటుడిగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అగ్రగామిగా నిలిచారు. అత్యంత ప్రసిద్ధ ముఖాలలో ఒకరైన కమల్ హాసన్ నేడు 69వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. 1954 నవంబర్ 7న ఆయన మద్రాస్ స్టేట్ లోని పరమకుడిలో జన్మించారు. 
 

కమల్ హాసన్ పుట్టిన రోజు సందర్భంగా KH234 టైటిల్ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. మరోవైపు అభిమానులు, సెలబ్రెటీలు ఆయనకు పెద్దఎత్తున బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. యూనివర్సల్ స్టార్ ఇప్పటి వరకు 230 సినిమాల్లో నటించారు. ఇన్నేళ్ల కెరీర్ లో ఆయన సంపాదించిన ఆస్తులు, ఎన్ని కోట్లు కూడబెట్టారనేది తెలుసుకుందాం.
 


చెన్నైలో పెరిగిన కమల్ హాజన్ కు అల్వార్ పేట్ లో ఓ రాజభవనం ఉంది. అది వాళ్ల పూర్వీకుల నుంచి దక్కింది. 60 ఏళ్ల కిందటి ప్రాపర్టీ ఇది. రెండేళ్ల కింద చెన్నైలోని పోష్ ఏరియా బోట్ క్లబ్ రోడ్‌లోని  తన కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యారు. ప్రస్తుతం అక్కడే ఉన్నారు. చెన్నైలో 7 చోట్ల, మంగళూరులో 3 చోట్ల, బెంగళూరులో 2 చోట్ల ఆస్తులు కొనుగోలు చేశారు. 
 

అలాగే, రూ.17 కోట్లు విలువ చేసే వ్యవసాయ భూమి కూడా ఉంది. చెన్నైలోనే మొత్తం ఉలగనాయగన్ కు రూ.131 కోట్ల ఆస్తి ఉన్నట్టు గతంలో ప్రభుత్వానికి లెక్క చెప్పారు. ఇప్పుడు ఆస్తి రెట్టింపు స్థాయిలో ఉందని తెలుస్తోంది. తమిళ బిగ్ బాస్, సినిమాల నుంచి భారీ మొత్తంలో సంపాదిస్తున్నారు. కేవలం బిగ్ బాస్ తోనే రూ.130 కోట్లు సంపాదించారని తెలుస్తోంది.
 

ఇండియాతోపాటు లండన్ లోనూ కమల్‌కు తన పేరు మీద రిజిస్టర్ అయిన ఇల్లు ఉంది. ఎప్పుడూ కమల్ హాసన్, అతని కుటుంబం లండన్‌కు వెళ్తూవస్తుంటారు. అందుకే అక్కడ ఇల్లు కొనుగోలు చేశారంట. దాని విలువ రూ.2.5 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. అలాగే కమల్ హాసన్ ఫ్యాషన్ బ్రాండ్ - ‘కేహెచ్ హౌస్ ఆఫ్ ఖద్దర్’ను కూడా రన్ అవుతున్నారు. 
 

KH హౌస్ ఆఫ్ ఖద్దర్ ను రెండేళ్ల కింద చికాగోలోనూ ప్రారంభించారు. చేనేత కార్మికుల మంచి భవిష్యత్ కోసం ఈ బ్రాండ్ ను ప్రారంభించారు. ఈ వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. అలాగే కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ లోనూ చాలా సినిమాలు రూపొందించారు. ఇలా కమల్ హాసన్ మొత్తం ఆస్తుల విలువ రూ.388 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. గత నాలుగేళ్లలోనే కమల్ హాసన్ ఆస్తి బాగా పెరిగిందంట. 

Latest Videos

click me!