సినిమా చూశాక ప్రియుడి రియాక్షన్‌ అడిగితే ఇబ్బంది పడ్డ పాయల్.. ఆయన సపోర్ట్ లేకపోతే ఈ మూవీ చేసేది కాదట..

Published : Nov 18, 2023, 09:29 PM ISTUpdated : Nov 18, 2023, 09:32 PM IST

`మంగళవారం` మూవీ సక్సెస్‌ టాక్ వస్తోన్న నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో సక్సెస్‌ ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. దీనికి పాయల్‌ తన బాయ్‌ ఫ్రెండ్‌ సౌరభ్‌ దింగ్రాతో కలిసి వచ్చింది. 

PREV
15
సినిమా చూశాక ప్రియుడి రియాక్షన్‌ అడిగితే ఇబ్బంది పడ్డ పాయల్.. ఆయన సపోర్ట్ లేకపోతే ఈ మూవీ చేసేది కాదట..

పాయల్‌ రాజ్‌పుత్‌కి చాలా రోజుల తర్వాత హిట్‌ పడింది. `ఆర్‌ఎక్స్ 100` తర్వాత ఆమెకి హిట్‌ లేదు. మళ్లీ ఆ చిత్ర దర్శకుడు అజయ్‌ భూపతి ఇప్పుడు `మంగళవారం`తో హిట్‌ ఇచ్చాడు. దీంతో చాలా రోజుల తర్వాత పాయల్‌ రాజ్‌పుత్‌ ముఖంలో ఆనందం కనిపిస్తుంది. ఈ సంతోష సమయంలో ఆమె తన బాయ్‌ ఫ్రెండ్‌ సౌరభ్ దింగ్రాతో కలిసి ప్రెస్‌మీట్‌కి రావడం విశేషం. 

25

`మంగళవారం` మూవీ సక్సెస్‌ టాక్ వస్తోన్న నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో సక్సెస్‌ ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. దీనికి పాయల్‌ తన బాయ్‌ ఫ్రెండ్‌ సౌరభ్‌ దింగ్రాతో కలిసి వచ్చింది. అంతేకాదు ఆయనపై ప్రశంసలు కురిపించింది. అందరి ముందు ఆయనకు థ్యాంక్స్ చెప్పింది. ఆయన తన కెరీర్‌ పరంగా ఎంతో సపోర్ట్ గా నిలుస్తున్నాడని చెప్పింది. `నువ్వు సపోర్ట్ చేయకపోతే ఈ ప్రాజెక్ట్ చేసేదాన్ని కాదు` అని కూడా తెలిపింది. నువ్వు నన్ను స్ట్రగుల్స్ లో ఉన్నప్పుడు పిక్‌ చేసుకున్నావు, ఎప్పుడూ నా చుట్టే ఉన్నావు. చాలా మోటివేట్‌ చేస్తున్నావ`ని చెప్పింది పాయల్. 

35

ఇదిలా ఉంటే సినిమా రిజల్ట్ పై ఆయన రియాక్షన్‌ ఏంటి? మీతో ఏం చెప్పాడు? అనే ప్రశ్న పాయల్‌కి ఎదురైంది. దీనిపై స్పందించేందుకు ఇబ్బంది పడింది పాయల్‌. ఆయన తన చైల్డ్ వుడ్‌ నుంచి మంచి ఫ్రెండ్‌ అని చెప్పిన పాయల్.. సౌరభ్‌ గురించి ఏం చెప్పాలి? అంటూ ఆయన్ని చూస్తూ `నీ గురించి అడుగుతున్నారు ఏం చెప్పాలి? నేను ఏం మాట్లాడలేకపోతున్నా` అంటూ కాస్త ఇబ్బంది పడింది. 
 

45

ఆ తర్వాత స్పందిస్తూ, ఈ స్టోరీని తాము ఇద్దరం కలిసే విన్నామని చెప్పింది. అయితే ఆ సమయంలో తనకు ఈ పాత్ర చేయాలా? వద్దా అనే తేల్చుకోలేకపోయానని, ఆడియెన్స్ ఎలా తీసుకుంటారనే సందేహాలు కలిగాయి. 
 

55

మొదట ఈ పాత్ర నేను చేయాలా? వద్దా అనుకున్నాను. కానీ ఆ సమయంలో సౌరభ్‌ తనకు ప్రోత్సాహాన్ని ఇచ్చాడని, అజయ్‌ భూపతిపై నమ్మకం ఉందని, ఆయన బాగా చేయగలరని నమ్ముతున్నట్టు తెలిపారు. అంతేకాదు ఇలా అలా అని సొంతంగా చేయడం వద్దు, అజయ్ చెప్పినట్టు చేయమని సలహా ఇచ్చాడు. తాను కూడా అలానే చేశానని, దాని ఫలితమే ఇది అని చెప్పింది పాయల్‌. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories